అమెరికా అధ్యక్షుడికి రాష్ట్రపతి ఇచ్చే విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కానీ పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ కు మాత్రం ఆహ్వానం రాలేదు. దేశంలోని మొత్తం 8 మంది ముఖ్యమంత్రులను మాత్రమే ఈ విందుకు పిలిచారు. మరి కేసీఆర్ ను పిలిచి జగన్ ను ఎందుకు పిలవలేదు.. ఇందుకు అనేక రకాలుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.

 

అయితే ఈ విషయం కూడా ఏపీలో రాజకీయమైంది. అయితే.. జగన్ కు ఉన్న నేర చరిత్ర కారణంగానే ఏపీ సీఎం కు ఆహ్వానం అందలేదని వైసీపీ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తోంది. దీంతో ఈప్రచారం వైసీపీకి చిర్రెత్తించింది. ఈ విషయం స్పందించిన మంత్రి కన్నబాబు.. ఓ రేంజ్ లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.

 

ఆయన ఏమన్నారంటే.. “ వైయస్‌ జగన్‌ ట్రంప్‌ ప్రక్కన కూర్చోనే స్థాయి ఉన్న వ్యక్తే.. వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఇండియాకు వస్తే పొలాలకు తీసుకెళ్లారు. ఇవాళ ట్రంప్‌ దేశానికి వస్తే రాష్ట్రపతికి ఉన్న క్రైటీరియా ప్రకారం 8 మంది సీఎంలను మాత్రమే పిలిచారు. అందుకే జగన్ ను పిలవలేదు అని వివరించారు మంత్రి కన్నబాబు.

 

కన్నబాబు ఇంకా ఏమన్నారంటే.. “ ఇది చంద్రబాబుకు తప్పుగా కనిపించింది. చంద్రబాబును వైయస్‌ జగన్‌ ఓడించినందుకు ట్రంప్‌కు కోపం వచ్చి ఉంటుంది. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడానికి చంద్రబాబుకు సిగ్గు లేదా?. ఇదే ట్రంప్‌ను ఓడిస్తానని చంద్రబాబు అమెరికా వెళ్లారు. అక్కడ ట్రంప్‌ గెలిచాడు.”

 

" ట్రంప్‌ విమానం దిగగానే చంద్రబాబు ఎక్కడా అని అడిగినట్లు ప్రచారం జరుగుతుంది. అమెరికాలో నన్ను ఓడిస్తానన్న చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారంటే జోలె పట్టుకొని తిరుగుతున్నారని సమాధానం చెప్పినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చంద్రబాబు ఆస్తులు ప్రకటించారా అని ట్రంప్‌ అడిగినట్లు కూడా ప్రచారం జరుగుతుందని వైసీపీ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: