జగన్ అమ్ములపొదిలో నుండి సెన్సేషనల్ పథకం అమలులోకి వచ్చింది. అదే జగన్ అన్న వసతి దీవెన. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు సంబంధించిన ఈ పథకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 'అమ్మఒడి' తరహాలోనే ఈ పథకాన్ని రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు ప్రతి ఏటా 20 వేల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా హాస్టల్ ఖర్చు నిమిత్తమై నేరుగా విద్యార్థుల ఎకౌంటు లోకి డబ్బులు ప్రభుత్వం జమ చేస్తోంది. డిగ్రీ మరియు పీజీ చదివే విద్యార్థులకు రెండు విడతలుగా ఈ డబ్బులు ప్రభుత్వం ఇవ్వబోతోంది.  వసతి, భోజనం ఖర్చుల కోసం విద్యార్థుల తల్లులకు ఈ మొత్తం చేర‌డం ద్వారా విద్యార్థుల‌కు ఇచ్చే సొమ్ము విష‌యంలో ఆయా కుటుంబాలు ఆర్థిక భారం త‌గ్గుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

 

కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి ఇవ్వ‌డం ఈ ప‌థ‌కం ప్ర‌ధాన ఉద్దేశం కావ‌డంతో చాలా పేద కుటుంబాలలో సంతోషం వెల్లివిరుస్తుంది. దాదాపు ఒక లక్షా 87 వేల మందికి ఈ పథకం వర్తిస్తుంది అని అంటున్నారు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు. ఈ మేరకు ఈ పథకం కింద 2,300 కోట్లు ఖర్చు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా ఉండటమే కాకుండా వాళ్ల చదువు నిమిత్తమై వాళ్ల కుటుంబాల గురించి తల్లిదండ్రులు పడే కష్టాలు గురించి ఆలోచించకుండా కేవలం చదువుకోవాలని ఉద్దేశంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు అంటున్నారు.

 

ముఖ్యంగా తన పాదయాత్రలో ఓ విద్యార్థి హాస్టల్ ఫీజు నిమిత్తమై సూసైడ్ చేసుకుని చనిపోయిన తల్లిదండ్రులు పాదయాత్రలో కలవడంతో వాళ్ళ బాధ మరొకరికి రాకూడదని ముఖ్యంగా తన పరిపాలనలో రాకూడదని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు తాజాగా ఈ పథకం గురించి సంచలన కామెంట్ చేస్తున్నారు. మరోపక్క విభజన తో నష్టపోయి అసలే లోటు బడ్జెట్ కలిగిన రాష్ట్రంలో ఇటువంటి పథకం అమలు చేస్తే మొత్తానికి బడ్జెట్ ఎదురు తన్నుతుంది అని అనుకొన్న ఈ పథకమే ఇప్పుడు జగన్ నెత్తిన పాలు పోసే విధంగా ప్రజలలోనుండి మంచి స్పందన రావటం వైసీపీ వర్గాల్లో మంచి జోష్ నింపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: