బిజెపి పార్టీ నేతలు అవుననే అంటున్నారు. ఓవర్ యాక్షన్ చేస్తే ఎటువంటి వారికైనా ఇటువంటే పరిస్దితి ఎదురవుతుంది తమ పార్టీలో అంటూ కొందరు కమలనాధులు ఫిరాయింపు ఎంపిని ఉదాహరణగా చూపుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం, నరేంద్రమోడి బంపర్ మెజారిటితో రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటికే కేసులు, కేంద్ర దర్యాప్తు సంస్ధల సోదాలు, అవినీతి ఆరోపణలు, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల నుండి దోచేసుకున్నందుకు కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

 

ఎందుకైనా మంచిదన్న ఉద్దేశ్యంతో  చంద్రబాబునాయుడే టిడిపిలోని నలుగురు రాజ్యసభ ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ ను బిజెపిలోకి పంపారు. సరే వీళ్ళేమీ పులు కడిగిన ముత్యాలు కాకపోయినా రాజ్యసభలో పార్టీ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నరేంద్రమోడి వీళ్ళను బిజెపిలోకి చేర్చుకున్నారు.

 

బిజెపిలోకి చేరిన తర్వాత ముగ్గురు ఎంపిలు దాదాపు కామ్ గా ఉంటే సుజనా మాత్రం ఓవర్ యాక్షన్ మొదలుపెట్టాడు.  రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయంలోను చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు. అదికూడా చంద్రబాబుకు పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అయినదానికి కానిదానికి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో బిజెపి అగ్రనేతల దగ్గర సుజనా పంచాయితి జరిగిందట. అందుకనే ఈ ఫిరాయింపు ఎంపిని పార్టీ కార్యక్రమాల్లో పూర్తిగా దూరం పెట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది.

 

ఏపికి సంబంధించిన ఏ విషయంలో కూడా ఈ ఎంపిని సంప్రదించటం లేదట. మొన్న విజయవాడలో జరిగిన పదాదికారుల సమావేశానికి కూడా సుజనాకు ఆహ్వానం పంపలేదట. అందుకనే ఇదే విషయమై బిజెపి జాతీయ అధికారపార్టీ ప్రతినిధి, రాజ్యసభ ఎంపి మాట్లాడుతూ సుజనాకు ఇంకా టిడిపి వాసనలు పోలేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అంటే ఏపి విషయాల్లో సుజనాను పూర్తిగా దూరం పెట్టేసినట్లే అనుకోవాలి. తనంతట తానుగా ఏదైనా మాట్లాడినా అది ఆయన వ్యక్తిగతమే కానీ పార్టీకి సంబంధం లేదని బిజెపి నేతలు చెప్పేస్తున్నారు. మొత్తానికి సుజనా పరిస్ధితి అధ్వాన్నంగా మారిపోయిందని తెలిసిపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: