తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా వరుసగా పార్టీ నేతలతో వరుసగా సమావేశం అవుతున్నారు. పార్టీ పరిస్థితి, నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను ఆయన ఆరా తీస్తున్నారు. స్థానిక నాయకత్వంతో సమావేశమైన చంద్రబాబు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పలు చర్చలు కూడా చేసారు చంద్రబాబు. ఇక చంద్రబాబు పర్యటనలో కార్యకర్తలు కూడా బ్రహ్మరధం పడుతున్నారు. ఇక ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

 

నియోజకవర్గంలో కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. తన మీద కక్షతో నియోజకవర్గానికి ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ఇక ఇది పక్కన పెడితే చంద్రబాబు తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసారు. ఆ ఫోటో లో ఆయన చిన్న నాటి జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు రోజుల నుంచి కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు... కుప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామానికి వెళ్లారు. 

 

ఈ సందర్భంగా తన ఎస్వీ యూనివర్సిటీలోని తన నా సహాధ్యాయి రత్నం కుటుంబాన్ని కలవడంతో పాటుగా తన స్నేహితుడి తండ్రి 98 ఏళ్ల పి.ఆర్. శ్యామ్‌ను కలిసి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా రత్నం తన దగ్గర ఉన్న పాత ఫోటోలను చంద్రబాబుకు చూపించారు. దీనితో చంద్రబాబు కాలేజి రోజులకు వెళ్ళిపోయారు. ఆ ఫోటో చూడగానే ఉత్సాహం వచ్చింది అంటూ కామెంట్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. కాగా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలను టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో పాటుగా నియోజకవర్గంలో అభివృద్దిని ప్రభుత్వం అడ్డుకుంటుంది అంటూ చంద్రబాబు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: