ఏపీలో ‘స్థానిక’ సమరం జరిగే తేదీ ఇంకా వెలువడకపోయిన, అతి త్వరలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరెక్ట్ తేదీ రాకపోయిన ప్రధాన పార్టీలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఇప్పటి నుంచే వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమైపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే స్థానిక పోరులో కూడా దుమ్ములేపాలని అధికార వైసీపీ చూస్తుంటే, 9 నెలల్లోనే జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, స్థానిక పోరు తమకే కలిసొస్తుందని ప్రతిపక్ష టీడీపీ ఆశ పెట్టుకుని ఉంది.

 

ఇక ఈ రెండిటి మధ్యలో ఎంతో కొంత సత్తా చాటాలని జనసేన-బీజేపీలు చూస్తున్నాయి. అయితే ఎవరు ఎలా అనుకున్న అసెంబ్లీ ఎన్నికలని బట్టి చూస్తే అధికార వైసీపీకి మెజారిటీ స్థానాలు రావడం ఖాయం పక్కా, ఆ తర్వాత టీడీపీ కొంచెం ప్రభావం చూపే అవకాశం ఉంది. జనసేన-బీజేపీలు టీడీపీ విజయావకాశాలపై దెబ్బ కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే ఈ విషయాలని పక్కనబెట్టేస్తే...ప్రధానమైన నగర పాలక సంస్థల్లో వైసీపీ అదిరిపోయే విజయాలని అందుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.

 

ముఖ్యంగా ఒంగోలు, నెల్లూరు కార్పొరేషన్‌లని వైసీపీ వన్‌సైడ్‌గా గెలుచుకోవడం ఖాయం. మామూలుగానే రెండు జిల్లాలు వైసీపీకి కంచుకోటలు. మొన్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉన్న 10 సీట్లని, ఒక ఎంపీ స్థానాన్ని వైసీపీనే క్లీన్ స్వీప్ చేసి దక్కించుకుంది. ఇక స్థానిక సమరంలో కూడా క్లీన్ స్వీప్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ముఖ్యంగా నెల్లూరు కార్పొరేషన్‌లో ఫ్యాన్ సునాయాస విజయం సాధిస్తుంది.

 

అటు ప్రకాశం జిల్లాలో కూడా ఉన్న 12 సీట్లలో 8 స్థానాలని వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ 4 చోట్ల విజయం సాధించింది. అలాగే ప్రధాన ఒంగోలు ఎంపీ సీటులో వైసీపీ బంపర్ విక్టరీ కొట్టింది. ఇక దాని బట్టి చూస్తే ఒంగోలు కార్పొరేషన్‌ని సింగిల్ హ్యాండ్‌తో వైసీపీ ఎత్తుకుపోవడం ఖాయం. మొత్తానికైతే ఒంగోలు, నెల్లూరు కార్పొరేషన్‌ల్లో ఫ్యాన్ హవా కొనసాగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: