అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన చాలా హాట్ హాట్ గా సాగుతోంది. మొట్ట మొదటి రోజు అహ్మదాబాద్ స్టేడియంలో భారత ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా ప్రధాని మోడీ గురించి డోనాల్డ్ ట్రంప్ పొగడ్తల వర్షం కురిపించారు. ఒక టీ అమ్ముకునే స్థాయి నుండి దేశానికి ప్రధాని అయ్యే స్థాయికి మోడీ రావటం నిజంగా అభినందనీయమని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మోడీ ఎంత కష్ట పడతారో అంతట టాఫ్ మనిషి అంటూ పేర్కొనటం జరిగింది. ముఖ్యంగా భారత్ లో అనేక మతాలు ఉన్న ఎక్కడా కూడా గొడవలు జరగవని లార్జెస్ట్ డెమోక్రసీ కంట్రీ అయిన భారత్ లో ఎప్పుడు శాంతి వాతావరణం నెలకొంటుంది ఇది ప్రపంచానికి ఆదర్శం అంటూ డోనాల్డ్ ట్రంప్ మొట్ట మొదటి రోజు తన ప్రసంగంతో భారత్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నారు.

 

ఆ తర్వాత తాజ్ మహల్ మరియు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన మోడీ తర్వాత రోజు ద్వైపాక్షిక మరియు వాణిజ్య ఒప్పందాలు సమావేశాలలో బిజీబిజీగా గడిపారు. ఈ నేపథ్యంలో భారత్ లో టాప్ కంపెనీ సీఈఓ లతో సమావేశమైన సందర్భంలో డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే అమెరికా లో జరగబోయే మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో నేనే మళ్లీ అధ్యక్షుడిని అవుతానని డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

 

ఈ సందర్భంగా వివిధ అంశాలపై అమెరికన్ ఎంబసీ లో జరిగిన ఈ సమావేశంలో భారత్ సిఈఓలు అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పారు. అమెరికాలో ఉద్యోగ కల్పనలో ముందంజలో ఉన్నామని , అందువల్ల మరోసారి విజయం సాదిస్తామని అన్నారు డెమొక్రాట్లకు ఆయా అంశాలపై క్లారిటీ లేకుండాపోయిందని ఆయన అన్నారు.భారత్ తనకు అద్బుత స్వాగతం లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.తాను గెలిచినప్పుడు మార్కెట్లు పెరిగాయని, అందువల్ల మరోసారి గెలవడం మార్కెట్ లకు ఎంతో ఉపయోగమని ట్రంప్ అన్నారు. ఓ భారీ ఒప్పందం కోసం భారత్ తో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: