సీఎం అంటే హోదా కాదని, అదొక బాధ్యత అని, రాష్ట్రంలో ప్రతిఒక్కరికి తానే పెద్ద దిక్కు అనే విధంగా జగన్ పాలన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయన 9 నెలల పాలన గమనిస్తే అదేవిధంగా సాగింది. ఎన్నికల్లో వైసీపీకి కాకుండా టీడీపీ, జనసేన ఇలా ఏ పార్టీకి ఓటు వేసినా...అందరూ తన వాళ్లే అనే విధంగా పథకాలు అందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళలు, యువతకు చేయూత అందిస్తున్నారు. అయితే పాలన చేసేటప్పుడు ఏమైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్లడానికి కూడా జగన్ వెనుకాడటం లేదు.

 

ప్రభుత్వం తీసుకునే ఏవైనా నిర్ణయాలు వల్ల తప్పులు దొర్లితే, వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడితే, వెంటనే సీఎం లాగా కాకుండా ఓ మానవతవాదిగా ఆలోచిస్తున్నారు. ఈ విధంగా జగన్ అధికారంలోకి వచ్చాక చాలాసార్లు చేశారు. ఇటీవల కూడా పెన్షన్, రేషన్ కార్డుల విషయంలో అసలైన అర్హులకు అన్యాయం జరిగితే, వెంటనే స్పందించి, తప్పులని సరిదిద్ది వారికి న్యాయం చేయాలని అధికారులని కోరారు.

 

ఇక తాజాగా అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో లోపాలు ఉంటే సరిచేయడానికి సిద్ధమయ్యారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, జిల్లా కలెక్టర్లు, ఆయా అధికారులు పలు ప్రాంతాల్లో భూములు సమీకరణ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అలాంటి వారి దగ్గర బలవంతంగా భూమి సేకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

 

ఈ క్రమంలో జగన్ రంగంలోకి దిగి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే రూపంలో మనం మంచి కార్యక్రమం చేస్తున్నామని, కానీ ఇదే సమయంలో ఎవరి ఉసురూ తగలకూడదని, భూ సేకరణ సమయంలో కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు. రైతులని సంతోష పెట్టి భూమిని తీసుకోవాలని, అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి తీసుకోవాలని, ఫలానా కలెక్టర్‌ అన్యాయంగా భూమి తీసుకున్నాడనే అనే మాట తనకు ఎక్కడా వినిపించకూడదని, ఎవరికి అన్యాయం జరగకూడదని అధికారులకు క్లాస్ ఇచ్చారు.

 

మామూలుగా అయితే ప్రభుత్వం అనుకుంటే భూములు తీసుకోవడం పెద్ద లెక్క కాదు. కానీ ప్రజలకు అన్యాయం చేస్తూ తీసుకోవడం వల్ల అది ప్రభుత్వానికే మంచిది కాదని విధానంలో జగన్ ఆలోచించారు. అందుకే అధికారులతో ఆయన మాట్లాడారు. ఏదేమైనా జగన్‌కు ఉన్న మానవత్వం ఏ సీఎంకు లేదనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: