సత్తా లేని నాయకుడుని ఎంత భుజాన మోసిన ఏదొకరోజు ప్రజలు నేలమీద పడేయడం ఖాయం. ఉన్న అవకాశంతో డైరక్ట్‌గా పదవులు దక్కించేసుకుని, సత్తా చూపెట్టకపోతే అంతే సంగతులు. సరిగా టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి లోకేశ్ పరిస్తితి కూడా ఇలాగే తయారైంది. 2014లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, తన కుమారుడుని అందలం ఎక్కించాలని చెప్పి, ప్రజాక్షేత్రంలో పోటీ చేయించకుండా, ఎమ్మెల్సీ చేసి, మంత్రిని కూడా చేశారు.

 

లోకేశ్‌కు మంత్రి ఇవ్వడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. లోకేశ్ తన సత్తా నిరూపించకపోవడం వల్ల ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచి తొలిసారి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. అటు పార్టీ ఘోరంగా ఓడిపోయిన లోకేశ్‌లో ఏమన్నా నాయకత్వ లక్షణాలు వచ్చాయంటే అబ్బే అదేం లేదు. ఇప్పటికీ చంద్రబాబే కష్టపడుతున్నారు. ఏదో లోకేశ్ ట్విట్టర్ లో మాత్రమే హడావిడి చేస్తున్నారు. ఎప్పుడన్నా ఆయన ప్రజల్లోకి వచ్చిన పెద్దగా స్పందన రావడం లేదు.

 

ఇలా అయితే లోకేశ్ భవిష్యత్‌లో గెలుపు గుర్రం ఎక్కడం కష్టమని భావించిన చంద్రబాబు సడన్‌గా ఓ సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చినట్లు కనబడుతుంది.  తాజాగా జగన్ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా చంద్రబాబు, తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ పర్యటనలో ఉండగానే చంద్రబాబు లోకేశ్ ప్రస్తావన తీసుకొచ్చారు. కార్యకర్తలతో మాట్లాడుతూ...లోకేశ్ కుప్పంలో ప్రజా సమస్యలపై పోరాడతారని చెప్పారు. త్వరలోనే లోకేశ్ కుప్పంలో పర్యటిస్తారని వారికి తెలిపారు.

 

అయితే చంద్రబాబు ఈ విధంగా చెప్పడం బట్టి చూస్తుంటే, చినబాబు ఇంకా కుప్పంలోనే సెటిల్ అయిపోతారనే అర్ధమైపోతుంది. అసలు ఎన్నికల ముందే లోకేశ్‌ కుప్పంలో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కుప్పంలో అయితేనే లోకేశ్ గెలవగలుగుతారని ప్రచారం వచ్చింది. కానీ లోకేశ్ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అక్కడే ఉంటే కష్టమని భావించి... లోకేశ్‌ని ‌భవిష్యత్‌లో కుప్పం నుంచే బరిలోకి దించే ఆలోచనలో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు కార్యకర్తలతో అలా మాట్లాడారని అర్ధమవుతుంది.

 

పైగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. లోకేశ్‌కు రాష్ట్రమంతా తిరిగే సత్తా లేదు. దీంతో లోకేశ్‌ని కుప్పంలో పడేసి, తాను మిగతా పనులు చూసుకోవచ్చని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తానికైతే లోకేశ్ సత్తా అర్ధమైపోయి, చంద్రబాబు ఇలా సడన్ ప్లాన్ తెరపైకి తీసుకొచ్చారనే చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: