ఒకప్పుడు కొల్లేరు అంటే వన్యప్రాణి సహితంగా ఉండేది. ఎక్కడ చూసినా కొన్ని వందల పక్షులు ,మత్స్యకారుల చేపల వేట చాలా ఆహ్లాదంగా ఉండేది. ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు పేరు గాంచింది. కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో ఏర్పడిన డెల్టా. బుడమేరు, తమ్మిలేరు కూడా వచ్చి కొల్లేరులో కలుస్తాయి. ఆసియా ఖండంలోనే అతపెద్ద మంచినీటి సరస్సు. ఈజిప్టు, మలేషియా, మొదలైన దేశాల నుండి వలస పక్షులు ఇక్కడికి వచ్చి తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకుని వెళ్ళేవి. 

 

అలాంటి కొల్లేరు ఇప్పుడు అరణ్యం లాగా అగమ్యగోచరంగా ఉంది. పక్షులు రావడం ఏమో గానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు త్రాగునీరు కూడా దొరకడంలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కొల్లేటి కి విముక్తి కలగడం లేదు. కొల్లేరు ను బాగుచేస్తే చుట్టుపక్కల 44 గ్రామాల ప్రజలకు మేలు చేసినవారు అవుతారు. కొల్లేరు 60శాతం ఆక్రమణలకు గురైంది. ప్రభుత్వం ఇక్కడి లంకల గ్రామాల ప్రజలకు ఇచ్చినది, ప్రజలు సరస్సును అక్రమంగా ఆక్రమించుకుని, కట్టలు పోసి, చేపల చెరువులుగా మార్చినది పోగా కేవలం 40 శాతం సరస్సు మాత్రమే మిగిలి ఉంది. 

 

చేపల పెంపకం కారణంగా సరస్సులో కాలుష్యం కూడా పెరిగింది. దీనితో ఇప్పుడు ప్రజలు నరకం చూస్తున్నారు. దీని కోసం ఎన్ని ప్రణాలికలు చేసినా సరే కొల్లేరు బతుకు మాత్రం మారడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో ఏలూరు ఎంపీ గా ఉన్న మాగంటి బాబు దీనికి సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చారు. అయినా సరే కొల్లేరు బతుకు మాత్రం ఇప్పటి వరకు మారలేదు. క్రమంగా కాలుష్యం తో విదేశాల నుంచి వస్తున్న పక్షులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. సరస్సుని చూడటానికి వచ్చే వాళ్ళు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటి ప్రభుత్వం అయినా సరే కొల్లేరు విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటుంది ఏమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: