భారత్ లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన కుటుంబ సభ్యులకు అడుగడుగునా ఆప్యాయతతో నిండిని ఆహ్వానాలు పలుకుతున్నారు.  ఈ నేపథ్యంలో ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతుండడం పట్ల ట్రంప్ ఆనందం అంతాఇంతా కాదు. మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అపూర్వ స్వాగత కార్యక్రమాలు, నమస్తే ట్రంప్ ఈవెంట్ తో ట్రంప్ తన ప్రతిష్ఠ మరింత ఇనుమడించినట్టుగా భావిస్తున్నారు.  ఈ సందర్భంగా ఇది ఆరంభం మాత్రమేనని, అమెరికా, భారత్ తమ అనుబంధాన్ని మరింత దృఢతరం చేసుకుంటాయని, ప్రజల ఆకాంక్షలను మరింత ఉజ్వలంగా నెరవేర్చుతాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నిజమైన మిత్రుడని, ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

 

ఐదు నెలల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియంలో మోదీకి స్వాగతం పలికామని, ఇప్పుడేమో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానంలో తనకు స్వాగతం పలికారని చెప్పారు. మీ సాదర స్వాగతానికి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు.  గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, మోతెరా మైదానంలో  నిర్వహిస్తోన్న 'నమస్తే ట్రంప్' సభలో ఆయన మాట్లాడారు. నమస్తే అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక  మోడీ అంటే చాలా ఇష్టం.  ఎప్పుడు ఎక్కడ కలిసినా మోడీని ఆప్యాయతగా పలకరిస్తారు.  ఇద్దరి మధ్య బలమైన మైత్రి ఉందని చెప్పడానికి గతేడాది సెప్టెంబర్ లో జరిగిన హౌడి మోడీ కార్యక్రమమే ఇందుకు ఓ ఉదాహరణ. 

 

మోడీ కార్యక్రమానికి ట్రంప్ కూడా పాల్గొనడం విశేషం.  ట్రంప్ రావడంతో ఆ కార్యక్రమానికి మరింత జోష్ వచ్చింది.  ఈ నేపథ్యంలో భారత్  పర్యటనకు మొదటి సారిగా వచ్చారు. అలా ఇండియా వచ్చిన ట్రంప్ కు మోడీ దేశం తరపున భారీ స్వాగతం పలికారు.  అమెరికా అధ్యక్షులకు ఏ దేశంలోనూ ఇలాంటి స్వాగతం లభించలేదని, చాలా గ్రాండ్ గా స్వాగతం లభించినట్టు ట్రంప్ ప్రదాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: