ఎక్కడ ..? ఎక్కడ ..? ప్రపంచానికే ఐటీని పరిచయం చేసిన ఆ ప్రపంచ మేధావి చంద్రబాబు ఎక్కడ ? నాకు స్వాగతం పలకడానికి వచ్చాడా లేదా ..? నేను అర్జంటుగా ఆయన్ను చూడాలి అంటూ ... ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికా కు అధ్యక్షుడు అయిన డోనాల్డ్ ట్రంప్ ఆరా తీసాడు. అసలు అమెరికాలో నన్ను ఓడిస్తానని బాలకృష్ణ శపధం చేసిన ఆ బాబు ఎక్కడా ..? అంటూ భారత ప్రధాని మోదీని ట్రంప్ ఆరా తీయగా జోలె పట్టుకుని తిరుగుతున్నారని మోదీ చెప్పినట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేలుతున్నాయి. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చంద్రబాబు, మోదీ ట్రంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. 

 
ఇదే విషయమై అధికార పార్టీ వైసీపీ కూడా ఓ రేంజ్ లో స్పందించింది. ట్రంప్ పర్యటనకు సంబంధించి 8  రాష్ట్రాల సీఎం లకు ఆహ్వానాలు అందాయని, తెలంగాణ సీఎం కేసీఆర్ కి కూడా ఆహ్వానం అందినా జగన్ కు ఎందుకు అందలేదు అంటూ టీడీపీ అనుకూల మీడియా సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేస్తుండడం వైసీపీ దీనిపై స్పందించింది. చంద్రబాబు లా ఏపీ సీఎం జగన్ కు  అమెరికా అధ్యక్షుడి పక్కన కూర్చొని ఫొటోలు తీయించుకోవాలని, చేతిలో చేయి వేసి తిరగాలని కోరికలు ఏమాత్రం లేవని,  నిరంతరం ప్రజల్లో ఉండాలి. ప్రజల మనస్సుల్లో నిలిచిపోవాలన్నదే జగన్ ఉద్దేశం అంటూ వైసీపీ మంత్రి కన్నబాబు అన్నారు. 

IHG


అసలు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇంత ఘోరంగా ఓడించిన జగన్ పై ట్రంప్ కి బాగా కోపం వచ్చినట్టు ఉంది అందుకే జగన్ ను ట్రంప్ కలిసేందుకు ఇష్టపడలేదు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ట్రంప్‌ను ఓడిస్తానని చంద్రబాబు అమెరికా వెళ్లారు. అక్కడ ట్రంప్‌ గెలిచాడు. వైఎస్‌ జగన్‌ను ఓడిస్తానని రాష్ట్రమంతా తిరుగుతూ హడావుడి చేస్తే ఆయనకు 23 సీట్లు మాత్రమే వచ్చాయి. దేశమంతా చంద్రబాబు తిరిగి మోదీని ఓడిస్తాను అంటూ హడావుడి పడ్డాడు. అలాంటి చంద్రబాబును జనం ఎక్కడ కూర్చోబెట్టారో చూసారు కదా ..? ఇప్పుడేమో మోదీతో గొడవ పెట్టుకొని తప్పు చేశామని అంటున్నాడు. అసలు చంద్రబాబు ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు. పచ్చి అవకాశవాది అంటూ కన్నబాబు మండిపడ్డారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: