అసలేంటో ట్రంప్ భారదేశం రావడమేంటీ, ఇక్కడ పర్యటించడం ఏంటీ అంతా కలలా ఉందని అనుకుంటున్నారు కొందరు.. మొత్తానికి మన మోడీ గారు ట్రంప్‌ను ఇండియాకు రప్పించడానికి పడిన శ్రమ ఫలించింది.. ట్రంప్ పర్యటన విజయవంతమైంది.. అంతా బాగుంది కానీ మొతేరా స్టేడియంలో ఇండియా గురించి ట్రంప్  కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి పద్దతులను పొగుడుతూ, తనకు ఇండియా పలికిన స్వాగతం మర్చిపోలేనిదని, ఎప్పటికి గుర్తుండి పోతుందని, ఇక ఇండియా తనకు నిజమైన స్నేహితుడని, ఇండియాతో బలమైన మైత్రి ఉంటుందని చెప్పిన ట్రంప్, పాక్ గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  

 

 

అదేమంటే పాక్ తో సంబంధాలు కొనసాగుతున్నాయని, పాక్ లో పెరిగిపోతున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు సైనిక సహాయం చేస్తామని చెప్పగా, వక్ర బుద్ధి కలిగిన పాక్ మీడియా ట్రంప్ మాటలను, తనకు అనుకూలంగా మార్చుకుంది. భారత్‌లో లక్షలమందిలో ట్రంప్ పాక్ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తారని, ఇదే కాకుండా పాక్ తో సంబంధాలు బలంగా ఉన్నాయని, ఆదేశానికి తగిన సహాయాన్ని అందిస్తానని చెప్పడంతో మోడీతో సహా మొతేరా స్టేడియంలో ఉన్న ప్రజలంతా షాక్ అయ్యారని రాసుకొచ్చింది.

 

 

ఒక రకంగా  ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో  పాక్ సఫలం అయ్యిందని చెప్పాలి.  ఇంటర్నేషనల్ మీడియా మొతేరా స్టేడియం సభ గురించి ఒకలా రాసుకొస్తుంటే, పాక్ మీడియా మాత్రం తనకు అనుకూలంగా మార్చి రాసుకొని తన నీచపు బుద్ధిని మరోసారి చాటుకుంది... కనీసం పాక్ ఇలా చెప్పడానికి సిగ్గుండాలి. అమెరికాపైన చేసిన అత్యంత భయంకరమైన, హేయమైన దాడులను ఆ దేశప్రజలతో పాటు, పాలకులు కూడా ఎన్నడు మరవరని మరచిన పాకిస్దాన్, కనీసం ట్రంప్ పేరు వాడుకొని లాభపడాలని ఆశిస్తే మాత్రం, చివరికి ట్రంప్ పాక్‌ను పరిగెత్తించి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడని అనుకుంటున్నారట..

 

మరింత సమాచారం తెలుసుకోండి: