ఫ్యాషన్ ఫియోనిస్టా.. యూఎస్‌లో ఒకప్పుడు టాప్ మాడల్. మెలానియా ట్రంప్ డ్రస్సింగ్‌పై ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో చిన్న సైజు చర్చ మొదలైంది. సింపుల్, క్లాసీ మిడీ డ్రస్‌లతో మెస్మరైజ్ చేశారు మెలానియా. ఇవాంక కూడా పూల పూల గౌనులతో మురిపించారు.

 

విమానం నుంచి దిగుతున్న సమయం నుంచి మెలానియా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ట్రంప్ నలుపు రంగు సూట్ ధరించగా.. మెలానియా మాత్రం తెలుపు రంగు దుస్తులను ధరించి.. అందరినీ ఆకర్షించారు.  మెలానియా ధరించిన వస్త్రాలను డిజైన్ చేసింది ప్రముఖ ఫ్రాన్స్ డిజైనర్ హర్వ్ పియర్. వైట్‌ డ్రస్ పై నడుముకి కట్టుకున్న గ్రీన్ కలర్ క్లాత్ కు భారత్ కు సంబంధం ఉందని చెప్పారు. దీన్ని గ్రీన్ సిల్క్‌తో , పైన బంగారంతో కూడిన త్రెడ్ వర్క్‌ చేశారు. ఇదొక వింటేజ్ పీస్ గా హర్వ్ పియర్ అభివర్ణించారు. 

 

ఇవాంక రంగు రంగుల పూలతో తయారు చేసిన మిడ్డీ డ్రెస్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె  వేసుకున్న డ్రెస్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. ఇవాంక ధరించిన డ్రెస్ భారత కరెన్సీలో లక్షా 70వేల రూపాయలు. 2019లో అర్జెంటీనా వెళ్లినప్పుడు చివరిసారిగా ఆమె ఈ డ్రెస్ ధరించారు.  స్టన్నింగ్ ఔట్ ఫిట్ తో వచ్చిన ఇవాంక స్టేడియంలో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు.

 

మెలానియా, ఇవాంక విమానం దిగిన దగ్గర నుంచి వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్ మీదే నెటిజన్లు కళ్లు పడటం విశేషం. ఇద్దరూ చాల స్టైలిష్ గా రెడీ అయ్యి వచ్చారు. మెలానియా తెలుపు రంగు జంప్ సూట్ ధరించగా.... ఇక ఇవాంక పింక్ కలర్  ఫ్లోరల్ మిడ్డీ ధరించారు. ఇద్దరూ స్టైలిష్ గా కనిపిస్తూనే.. చాలా సింపుల్ గా తయారయ్యారంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

 

పర్యటనలో భాగంగా రెండో రోజు.. ఇవాంక క్రీమ్ కలర్ షేర్వాణీ తరహా డ్రస్‌ వేసుకుంటే.. మెలానియా  వైట్ కలర్ మిడ్డీ వేసుకున్నారు. నడుమకి రెడ్‌ కలర్ క్లాత్ చుట్టుకున్నారు. మిడ్డీ గౌను కూడా షర్ట్ టైప్‌లో కాలర్‌తో డిజైన్ చేశారు. వైట్ కలర్ డ్రస్ మీద...రంగు రంగుల డిజైన్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: