అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతుల గౌరవార్ధం రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ విందు ఇచ్చారు.  రాష్ట్రపతి భవన్ లో  ఇచ్చిన విందుకు అతికొద్ది మంది ప్రముఖులను మాత్రమే పిలుస్తారు. ఎందుకంటే ఎంతమందిని పిలవాలన్న విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం  నిర్ణయిస్తుంది. సహజంగానే ఇటువంటి విందుల్లో రాజకీయ నేతల కన్నా కార్పొరేట్ ప్రముఖులే ఎక్కువగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇపుడు కూడా అలాగే జరిగింది. అయితే చంద్రబాబునాయుడు మాత్రం కేసులున్న కారణంగానే జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందలేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. విందుకు ఎవరిని పిలవాలో నిర్ణయించేది ప్రధానమంత్రి కార్యాలయమే అన్న విషయం కూడా చంద్రబాబుకు తెలీదా ? దేశంలో ఎవరెవరిని పిలవాలో అమెరికా అధ్యక్షుడికి ఎలా తెలుస్తుంది ?  ఇక్కడ చంద్రబాబు చెప్పదలచుకున్నది ఏమిటంటే జగన్ పై కేసులున్నాయి కాబట్టే విందుకు ఆహ్వానం అందలేదని. అలా చెప్పుకుంటూ తృప్తి పడిపోతున్నారు.

 

నిజానికి జగన్ పై కేసులకు అమెరికా అధ్యక్షుడి విందుకు ఆహ్వానం రాకపోవటానికి సంబంధమే లేదు. విందుకు ఆహ్వానం అందుకున్న వారిలో ముఖ్యమంత్రుల సంఖ్య కేవలం ఎనిమిది మాత్రమే. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కూడా అందరికీ ఆహ్వానం అందలేదు. ఎనిమిది మంది ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, గవర్నర్లు, కార్పొరేట్ ప్రముఖులతో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖులను ఆహ్వానించారు.

 

అమెరికా అధ్యక్షుడు మనదేశంలో పర్యటించినపుడల్లా కేవలం కొంతమంది సిఎంలను మాత్రమే పిలుస్తారు. కొంత కాలం తర్వాత అమెరికా అధ్యక్షుడు మళ్ళీ పర్యటిస్తే అప్పుడు ఇపుడు పిలిచిన సిఎంలను పిలవకపోవచ్చు. అప్పుడు ఆహ్వానించే ముఖ్యమంత్రుల్లో జగన్ ఉండచ్చు చెప్పలేం. రాష్ట్రపతి ఇచ్చే విందుకు అమెరికాకు ఏమీ సంబంధం లేదని కూడ తెలియనంత గుడ్డి వ్యతిరేకతతో జగన్ పై కావాలనే చంద్రబాబు బురద చల్లుడు కార్యక్రమం ఎంత కాలం కంటిన్యు చేస్తారో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: