ప్ర‌స్తుతం ఎక్కువ‌గా అంద‌రూ పిల్ల‌లు, పెద్ద‌లూ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. అయితే దీని వ‌ల్ల ఆరోగ్య ప‌రంగా చాలా ఇబ్బందులే ఉన్నాయి. కానీ ఎవ్వ‌రూ కూడా వీటిని ప‌ట్టించుకోకుండా ఆ రుచుల‌ను ఎక్కువ‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మ‌రి దీని కోసం ఆరోగ్యం కూడా ప‌క్క‌న పెట్టేస్తున్నారు చాలా మంది. ఇక ప్ర‌స్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించి వంట‌లు చేసుకునే టైం లేక చాలా మంది త‌క్కువ స‌మ‌యంలో అయిపోయే ఫాస్ట్ ఫుడ్ క‌ల్చ‌ర్‌ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. ఇలాంటి వారిపై తాజాగా ఓ పరిశోధన సంస్థ రీసెర్చ్ చేసి తాజాగా వెల్లడించిన విషయాలు ప్రతీ ఒక్కరిని షాక్ కు గురి చేస్తోంది.

 

బిజీ లైఫ్ లో పడి మ‌నం ఏమి తింటున్నాం దాని వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంత వ‌ర‌కు మంచిది అన్న‌వాటి పై పెద్ద‌గా ఎవ్వ‌రూ ఫోక‌స్ చెయ్య‌డం లేదు.  ఆ పూట‌కి క‌డుపు నిండిందా అన్నంత వ‌రకే చూస్తున్నారు. అంతే త‌ప్పించి శ‌రీరానికి విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ అందుతున్నాయా లేదా అని మాత్రం ఎవ్వ‌రూ ఆలోచించ‌డం లేదు స‌రిక‌దా.. క‌నీసం దాని వ‌ల్ల వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ని కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్పెర్మ్(వీర్యం) కౌంట్ చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుందని పరిశోధనలో తెలింది. 19ఏళ్ల సగటు వయస్సున్న 2900 మంది వ‌పై పరిశోధన చేపట్టి తాజాగా వివరాలను వెల్లడించారు. పిజ్జా ప్రెంచ్ ప్రైస్ బీఫ్స్ స్నాక్ షుగరీ బేవరీ ఐటమ్స్ పాలిష్ చేసిన బియ్యం స్వీట్స్ తీసుకునే వారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ గా ఉన్నట్లు వెల్లడైంది. అలానే చేపలు, చికెన్, కూరగాయాలు, పండ్లు, నీళ్లు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉన్నట్లు తెలింది.

 


 అలాగే ఫాస్టుపుడ్ తీసుకునే ఆడవాళల్లోనూ అండోత్పత్తి(ఫెర్టిలిటీ) సమస్య ఏర్పడుతుందని తెలిపింది. డైట్ తోపాటు స్మోకింగ్ రేడియేషన్ ఫెస్టిసైడ్ బంగారం స్టీల్ చైన్లు వెండి వస్తువులు భారీగా ధరించడం కూడా స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం చూపుతుందని పరిశోధకులు అంటున్నారు. ఫాస్టుఫుడ్ ఇష్టంగా తినేవారు వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. మ‌రి ఫాస్ట్ ఫుడ్ ప్రియులారా ఇక మ‌రి జాగ్ర‌త్త వ‌హించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: