మరావతిలో రాజధాని నిర్మాణాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులంటూ ప్రకటించడమే కాకుండా దానిని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికేవిశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తు కూడా జరుగుతోంది. అయితే రాజధాని నిర్మాణానికి అమరావతి పరిసర ప్రాంత రైతులు ఇచ్చిన 35 వేల ఎకరాల భూముల్లో రైతులకు ఇవ్వాల్సిన ఇచ్చినా మిగతావి రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు పోనూ, ప్రభుత్వం ఆధీనంలో ఏడు, ఎనిమిది వేల ఎకరాల భూమి ఉంది. వాటిలో ప్రపంచ స్థాయి నిర్మాణాలు చేపడతామని, లక్షల కోట్ల ఆదాయం తీసుకువస్తామంటూ గత టిడిపి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టిడిపి నిర్ణయానికి షాకిచ్చేలా ఏపీ సీఎం జగన్ అమరావతి ప్రభుత్వ భూముల విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. 


పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం పంపిణీ చేసేందుకు సుమారు 1251 ఎకరాల భూమిని అమరావతి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్థలాల పంపిణీ సెక్షన్ 53(డి) ప్రకారం భూ సమీకరణ కింద సేకరించిన భూములు ఐదు శాతం పేదలు వసతి గృహ అవసరాల నిమిత్తం ఇవ్వాలని ప్రభుత్వ జీవో లో ఉంది. అందుకే ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన భూముల్లో 1251 ఎకరాలను గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న లబ్ధిదారులు అందరికీ పంపిణీ చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 54 వేల మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. 


 రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను పేదలకు ఇళ్ల స్థలాలు పంచడం ఏంటి అంటూ కొంతమంది టీడీపీ అనుకూల వ్యక్తులు కోర్టులో పిటిషన్ వేశారు. అయినా అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఇప్పుడు ఆ భూములను పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం అవుతుండడంతో మరోసారి ఈ వ్యవహారంపై రాజకీయ రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: