ఈ మధ్య కాలంలో వయసుతో పని లేకుండా ఎవరు పట్టిన కూడా మద్యంలో మునిగి తేలుతున్నారు. మద్యం ఆరోగ్యానికి హానికరం అని  ఎంత చెప్పిన కూడా వినకుండా మరీ మద్యానికి బానిసలుగా మారుతున్నారు. అయితే మద్యం సేవించడానికి టీనేజీ యువత ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఎందుకు వాళ్ళు అలా మద్యానికి బానిసలుగా మారుతున్నారు అనే విషయాన్నీ పరిశోధకులు తేల్చి చెప్పారు. 

 

 


మద్యం మత్తులో చాలా మంది తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.అయితే వాళ్ళు  అలా అలవాటు కావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ విషయం పై కొందరు పరిశోధకులు పరిశోధనలు జరిపి కొన్ని నమ్మలేని నిజాలను వెల్లడించారు. అయితే అవేంటో చూడండి. వాటి గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. చిన్న వయసులోనే మద్యం అలవాటు చేసుకుని చాలా మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. 

 


అలా మనుషుల ను పూర్తిగా మార్చివేస్తుంది. ఆ క్రమంలోనే వారు మద్యం అలవాటు కు బానిసలు గా మారడం వెనుక ఉన్న కారణాలపై అమెరికాలో ని న్యూయార్క్‌ వర్సిటీ పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని కనుగొన్నారు. మద్యం ఉత్పత్తుల యాడ్స్ టీనేజీ కుర్రాళ్లను తాగుడుకు బానిసలు గా మార్చుతున్నాయని తెలిపారు. పొగాకు ఉత్పత్తుల యాడ్స్‌తో  యువతపై పడుతున్న ప్రభావంపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించినట్లు వివరించారు. 

 

 

మద్యం బ్రాండ్‌ల ఆకర్షణీయమైన లోగోలు వంటివి టీనేజీ కుర్రాళ్లను అటువైపుగా ఆకర్షించేలా చేస్తున్నాయని తెలిపారు. మద్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను పట్టించుకోకుండా కుర్రాళ్లు మద్యానికి అలవాటు పడేలా ఈ యాడ్స్‌ చేస్తున్నాయని చెప్పారు.యువతను ఆకట్టుకునేలా వాణిజ్య ప్రకటనలు రావడంతోనే ఇలా యువతులు ఆకర్షితులు అవుతున్నాయి అంటూ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మద్యానికి బానిసలు కాకండి .. మీ జీవితాలను నాశనం చేసుకోకండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: