అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సందర్భంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారు. వీడియో మరియు ఆడియో టేపు లతో సహా రేవంత్ రెడ్డి దొరకకపోవడంతో ఆ కేసు అప్పట్లో సంచలనం అయ్యింది. ఇదే సందర్భంలో చంద్రబాబు వాయిస్ ఆడియో టేప్ బయటకు రావడంతో ఓటుకు నోటు కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం మరి అదే విధంగా చంద్రబాబు హైదరాబాద్ నగరం నుండి ఒక్కసారిగా పెట్టే బేడా తో సహా పరిపాలన మొత్తం బెజవాడ కి షిఫ్ట్ చేయటం పట్ల అనేక వార్తలు రావడం జరిగింది.

 

ఇప్పుడు ఇదే తరహాలో ప్రస్తుతం మల్కాజిగిరి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నరేవంత్ రెడ్డి పై భూదందా కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఓ భూ దందా కేసులో డిప్యూటీ కలెక్టర్ ను సస్పెండ్ చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ శివారులోని గోపన్నపల్లి వద్ద రేవంత్ రెడ్డి సోదరుల పేరుతో ఆరు ఎకరాలకుపైగా స్థలాన్ని డిప్యూటి కలెక్టర్ అక్రమంగా మ్యుటేషన్ చేశారన్నది అబియోగంగా ఉంది.

 

ఈ భూమి హక్కుదారులుగా నకిలీ వ్యక్తులను సృష్టించి ఆ తర్వాత వీరు కొనుగోలు చేశారని ప్రభుత్వ విచారణ లో వెల్లడైందని కదనాలు వస్తున్నాయి. బాదితులు కోర్టును ఆశ్రయించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీనిపై విచారణ చేయించగా, ఈ విషయాలు బయటపడ్డాయని తెలంగాణ రాజకీయాలలో వినబడుతున్న టాక్. రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కూడా ఈ దందాలో భాగస్వామి అని కూడా వార్తలు వినబడుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే త్వరలో ఈ కేసు విషయంలో రేవంత్ రెడ్డి అనేక రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలంగాణ రాజకీయాలలో వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: