మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం చట్టాలని ప్రవేశ పెట్టినా కూడా కామాంధుల  మాత్రం తీరడం లేదని చెప్పాలి. రోజులో దేశంలో ఎందరో మహిళలు ఇలాంటి దారుణాల ను ఎదుర్కొంటున్నారు. నిత్యం మగాళ్ల వాళ్ళ చాలా మంది మహిళలు అనేక సమస్యలను  ఎదుర్కొంటున్నారు. చిన్నారులు నుండి పండు ముసలాళ్ళ వరకు ఇదొక సమస్య తో  పడుతూనే ఉన్నారు.  కార్యాలయాల్లో  మహిళల కు రక్షణ లేకుండా పోతుంది. 

 


ఓ మహిళా  పై ఓ ప్రయాణికుడు దారుణాని కి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే..  ప్రభుత్వ  ఉద్యోగి అయిన ఓ మహిళా కండక్టర పై దారుణ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా కండక్టర్‌ దుస్తులను ఓ ప్రయాణికుడు చించేశాడు. ఆమె చొక్కాను పట్టుకుని, వదలకుండా పిడిగుద్దులు కురిపిస్తూ దాడి చేశాడు.

 

 

అసలు విషయాని కొస్తే.. చిత్తూరు జిల్లా  గుర్రంకొండ తరికొండల సమీపం లో ఈ ఘటన చోటు చేసుకుంది. మదనపల్లి డిపోకు చెందిన ఓ బస్సు  ఎక్కిన ప్రయాణికుడిని టిక్కెట్‌ తీసుకోవాలని మహిళా కండక్టర్‌  అడిగింది. తాను తీసుకోనని ప్రయాణికుడు చెప్పాడు.దీంతో తీసుకోవాల్సిందేనని ఆమె చెప్పడంతో శివారెడ్డి అనే వ్యక్తి దాడికి దిగాడు.ఇద్దరి మధ్య వాగ్వాదం చోట చేసుకోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

 

 

గొడవ ముదరడంతో దీంతో డ్రైవర్‌ బస్సును ఆపాడు. బస్సు కిందకు దిగి మహిళా కండక్టర్‌ను అందరూ చూస్తుండగానే అతడు కొట్టాడు. అతడిని తోటి ప్రయాణికులు అదుపుచేసి. పోలీసులకు సమాచారం అందించారు. అతడిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. అందరు  చూస్తున్న సమయంలో  జరగడంతో పలువురు మండిపడుతున్నారు. డ్యూటీలో ఉన్న మహిళా కండక్టర్ తో అమానుషంగా దూషించడంతో అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: