ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. తమ పాలనలో ఎక్కడ అవినీతి జరగకుండా పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఒకవేళ అవినీతికి పాల్పడుతున్నారు అని తెలిస్తే ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాడు. ఇకపోతే 2019 ఎన్నికల్లో ఘన విజయం తర్వాత వైసిపి ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న విషయం తెలిసిందే. 

 

 

 స్థానిక సంస్థల ఎన్నికల్లో  జగన్మోహన్ రెడ్డి సర్కార్  పాలనకు నిలువుటద్దంగా మారనున్నాయి. అయితే ఈ ఎన్నికల కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి.అయితే ప్రతిపక్ష టీడీపీ పార్టీ స్థానికంగా బలంగా ఉన్నట్లు తెలుస్తోంది... అధిక వైసీపీ పార్టీ కంటే  టిడిపి పార్టీ స్థానికంగా బలంగా ఉండడంతో ఈ ఎన్నికలు అధికార పార్టీకి మరింత ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి చెందిన అభ్యర్థులు భారీ స్థానాల్లో గెలవాలి అంటూ  మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. మంత్రి పదవులు నిలబెట్టుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని స్పష్టం చేస్తున్నారు. 

 

 

 ఇటీవలే తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు హెచ్చరికలు జారీ చేసి భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా మంత్రులకు అలాంటి లక్ష్యాన్ని విధిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను మార్చి 15వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే విడుదల కాబోతున్నట్లు  తెలుస్తోంది.అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చాటిన అఖండ విజయాన్ని సాధించాలని  మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటితేనే  మంత్రి గా కొనసాగే అవకాశం ఉంది అంటూ చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు సహా పలు కీలక అంశాలపై మంత్రులు ఎమ్మెల్యేలు నేతలందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక జగన్ హెచ్చరికలు జారీ చేయడంతో మంత్రులు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: