బీజేపీ హైకమాండ్ రెండు తెలుగు రాష్ట్రాలలో సరైన అధ్యక్షులు నియమించడానికి కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత బిజెపి ఎంపీల లో ఒకరిని తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా నియమించడానికి హైకమాండ్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బీజేపీ అధ్యక్షుడు పదవిని భర్తీ చేసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకుల పేర్లు చాలానే వినబడుతున్నాయి. విష్ణుకుమార్ రాజు, పురంధరేశ్వరి, ఎమ్మెల్సీలు పీపీఎన్ మాథవ్, సోము వీర్రాజు బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇలా లిస్ట్ చాలా పెద్దగానే ఉంది.

 

అయితే అధిష్టానం మాత్రం ఏపీలో అధ్యక్షుడు ఎంపిక విషయంలో తొందర పడకూడదు అని నిర్ణయించుకుంది. అందుకే ఆలోచించి సమర్థుడైన నాయకుడిని ఎంపిక చేయాలని చూస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు కన్నా లక్ష్మీనారాయణ ని బిజెపి అధ్యక్ష పదవి ఇవ్వడానికి గల కారణం ఆయన కాపు సామాజిక వర్గం కాబట్టి. విషయంలోకి వెళితే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసిపి రెడ్ల పార్టీగా మరియు తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీగా బలమైన ముద్ర ఉండటంతో బీజేపీకి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని నియమిస్తే కాపు ఓట్లు పడే అవకాశం ఉందని కన్నా లక్ష్మీనారాయణ నీ బీజేపీ అధిష్టానం నియమించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

 

కానీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ నీ నియమించిన గాని పెద్దగా మైలేజ్ రాష్ట్రంలో సాధించింది ఏమీ లేదు. ఇటువంటి సమయంలో జనసేన మరియు బిజెపి పార్టీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ని నియమించాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ' నా వల్ల కాదు .. నాకు ఇష్టం లేదు’ పార్టీ అధ్యక్షుడిగా నేను పని చేయలేను ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క పార్టీ అధ్యక్షుడు అంటే బాగోదు అంటూ చేతులెత్తేసినట్లు జనసేన పార్టీ వర్గాల్లో వార్తలు వినబడుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: