కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇక పలు  రాష్ట్రల్లో  అయితే ఈ నిరసనలు విధ్వంసకరంగా  కూడా మారాయి. అయితే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు  ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయి  అనుకుంటున్న తరుణంలో... మరో సారి దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. తీవ్ర స్థాయిలో ఢిల్లీలో అలలు జరుగుతుండగా ఎంతో మంది మృతి చెందుతున్నారు. అయితే పోలీసులు నిరసనకారులను ఎంత అదుపుచేసేందుకు ప్రయత్నించినప్పటికీ నిరసనకారులు మరింత రెచ్చిపోయి మరీ అల్లర్లు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలు హింసాత్మక రూపం దాలుస్తున్నాయి. 

 

 

 అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండవ రోజు పర్యటనలో భాగంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అయితే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింసాత్మక అల్లర్ల గురించి తాను విన్నానని కానీ దీనిపై చర్చించలేదు అని తెలిపారు. ఈ విషయం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారం అంటూ అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. మత స్వేచ్ఛ పై ప్రధాని నరేంద్ర మోడీతో  సమావేశంలో చర్చించాము అంటూ తెలిపిన డోనాల్డ్ ట్రంప్... ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలి అంటూ మోడీ గట్టిగా కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు

 

 అయితే మోడీతో భేటీ లో భాగంగా పౌరసత్వ సవరణ చట్టం గురించి మోదీతో చర్చించలేదు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు దాడులు గురించి విన్నాను అంటూ  తెలిపిన డోనాల్డ్ ట్రంప్ దానిపై  మాత్రం తాను చర్చించలేదు అంటూ తెలిపారు. వాటిని భారత్ ఎదుర్కొంటుంది అంటూ చెప్పారు. ఇదిలా ఉంటే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా... దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు అల్లరి హింసాత్మకంగా మారుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లలో  తొమ్మిది మంది మరణించారు. ఢిల్లీలోని అల్లర్లను అదుపు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: