వ్యభిచారం చట్ట రీత్యా నేరం అని ప్రభుత్వం తేల్చి చెప్పడం తో సెక్స్ రాకెట్లు తమ రూటును మార్చుకున్నారు. శారీర ధృత్వాన్ని ఇస్తామంటూ స్పా పేరు తో జోరుగ్గా సెక్స్ దందాను సాగిస్తున్నారు.  ఆశ చూపించి ఈ దందా ను  సాగిస్తున్నారు.  నగరాల్లో ఈ దందా పడగ విప్పిందని చెప్పాలి. పలు రాష్ట్రాల్లో ఈ దందా జోరు గా సాగుతుంది. జంట నగరాల్లో ఈ సెంటర్లు హవా కొనసాగిస్తున్నాయి. 

 

 


మసాజ్ సెంటర్ల పేరు తో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నార న్న సమాచారం తో ఓ స్పా సెంటర్‌‌ పై దాడులు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న పలువురి ని అరెస్టు చేశారు. ఇద్దరు విటులతో సహా ఐదుగురిని అదుపులో కి తీసుకున్నారు.స్పా ముసుగులో అందమైన అమ్మాయిల తో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిర్వాహకుడు చందన్ జైస్వాల్‌ను అరెస్టు చేశారు. 

 

 


అతనికి సహకరిస్తున్న మొహద్ డానిష్, లోక్‌నాధ్ దాస్ అనే మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారితో పాటు మరో ఇద్దరు విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు.స్పాల ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న సెక్స్ రాకెట్‌ గుట్టురట్టు చేశారు కోల్‌కతా పోలీసులు.  చాలా మంది స్పా కోసం వస్తూ ఉన్నారని విచారణలో తేలింది. ఈ స్పా లకు పెద్ద పెద్ద ముఠా నే వస్తుందని వెల్లడిసున్నారు. 

 

 

గతంలో దుర్గాపూర్‌లోని స్పా, బ్యూటీ పార్లర్‌పై దాడులు చేశారు. వ్యభిచారం చేస్తున్న 16 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మహిళలను ఎరగా వేసి డబ్బులు దండుకుంటున్నారన్న సమాచారం తో పోలీసులు దాడులు చేశారు.అక్కడకు పోలీసులు విటులు గా వెళ్లి వ్యభిచారమ్ జరుగుతుందని తెలుసుకొని గుట్టు రట్టు చేశారు. ఇద్దరు నిందితుల ను అదుపులో కి తీసుకున్నారు. పూర్తి వివరాలు  త్వరలోనే వెల్లడిస్తామ ని పోలీసులు అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: