ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో ముందునుండి విభేదాలు చెలరేగుతూనే ఉన్నాయి. మామూలుగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైసిపి అని చాలామందికి తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్య ఏపీ రాజకీయం తిరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో మూడో పార్టీ రావాలని ప్రయత్నాలు చేసినా చాలా వరకు ఏపీ ప్రజలు అంతగా అవకాశం ఇవ్వలేదు కూడా. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో తాజాగా కుప్పం వర్సెస్ పులివెందుల అభివృద్ధి అన్నట్టు గట్టి చర్చ ఒకటి నడుస్తుంది.

 

విషయంలోకి వెళితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో జగన్ నియోజకవర్గం పులివెందుల అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ కనీసం నిధులు కూడా కేటాయించలేదని అంతేకాకుండా త్రాగునీరు కి కూడా పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు అనేక అవస్థలు పడినట్లు అప్పట్లో వార్తలు రావడం జరిగింది. అయితే తాజాగా జగన్ ముఖ్యమంత్రి కావడం తో చంద్రబాబు మాదిరిగా కాకుండా తన సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గం ఎలా అభివృద్ధి జరుగుతుందో అదే స్థాయిలో చంద్రబాబు నియోజకవర్గం కుప్పం కూడా అభివృద్ధి జరగాలని సంచలన నిర్ణయం జగన్ తీసుకోవడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గాన్ని మున్సిపల్ నియోజకవర్గంగా జగన్ గుర్తించడం జరిగింది. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జగన్ ప్రభుత్వం కుప్పం లో చేయడం జరిగింది. దీంతో ఇటీవల చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర లో చేయని అభివృద్ధి పనులను...చేసినట్టు చంద్రబాబు మాట్లాడటం పట్ల సొంత పార్టీ నేతలే చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై నవ్వు కుంటున్నట్లు ఏపీ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. మరోపక్క కుప్పం నియోజకవర్గం లో వచ్చే ఎన్నికల లోపు వైసీపీ జెండా ఎగిరేలా వైయస్ జగన్ మరిన్ని సరికొత్త నిర్ణయాలు త్వరలో తీసుకోబోతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: