పాపపుణ్యాలు ఎరుగకుండా తనపని తాను చేసుకుంటున్న యమపాశం కరోనా వైరస్.. ఇప్పటికే నిర్దాక్షిణ్యంగా కొన్ని వేల ప్రాణాలు తీసింది.. లక్షల కోట్ల మందిని భయంతో బ్రతికేలా చేస్తుంది.. చివరికి కరోనా బాధితులకు సేవచేస్తున్న వారు కూడా దీని బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు.. ఇక చైనాలో పరిస్దితి మరీ దారుణం.. కడుపు నిండా తిండి, కంటి నిండా నిదుర కరువైన అక్కడి ప్రజలు బ్రతికుండగానే నరకాన్ని అనుభవిస్తున్నారు..

 

 

ఇకపోతే రాజకీయా నాయకునికి కూడా ఈ కరోనా సోకింది.. ఇక్కడ కాదండి ఇరాన్‌లో.. ఆ వివరాలు తెలుసుకుంటే.. తాజాగా ఇరాన్‌ డిప్యూటీ ఆరోగ్య మంత్రి ఇరాజ్‌ హరిర్చీకి కూడా ఈ కరోనా వైరస్ సోకినట్లు ఆ దేశ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ మంత్రి.. తన అధికారిక ట్విటర్ ద్వారా తెలిపారు. సోమవారం నాడు జరిగిన ఓ సమావేశంలో హాజరైన మంత్రి.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు కనిపించగా అనుమానంతో అతనికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు ఆరోగ్య శాఖ మీడియా సలహాదారు అలిరెజా చెప్పారు.

 

 

కరోనా పాజిటివ్ అని తేలడంతో.. మంత్రి తనంతట తానే.. మంగళవారం నిర్బంధంలోకి వెళ్లారు. ఇక ఈ రాక్షసిని దైర్యంగా ఎదుర్కొని దానిమీద విజయం సాధించాకే తాను బయటకు వస్తానని, అప్పటి వరకు బయటకు రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం మందులు తీసుకోవడం ప్రారంభించానని. ఇప్పుడు పరిస్థితి సాధారణంగానే ఉందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

 

ఇదే కాకుండా  మీ అందరి దయతో ఈ కరోనా మహమ్మారిని త్వరలోనే జయిస్తాననుకుంటున్నానని పేర్కొన్నారు... అయితే చాలామందికి వైరస్‌ సోకినప్పటికీ మన వద్ద మంచి వైద్య సదుపాయాలు ఉన్నాయి.. కానీ సాధ్యమైనంత వరకు ప్రజలు ఈ వైరస్‌ సోకకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: