ఏంటో.. అసలు.. సామాన్యులకు బతుకే భారం అయ్యేలా ధరలు పెరుగుతున్నాయి.. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు అన్ని ఆకాశాన్ని తాకుతున్నాయి... మొన్నటివరకు ఉల్లిపాయ ధర ఆకాశాన్ని తాకింది. ఇప్పుడు పాల ధర కూడా ఆకాశాన్ని తాకడానికి దగ్గరగా ఉంది. 2 నెలల క్రితమే పాల ధర పెరిగింది. ఈ నెలలో మొన్న కూడా ఒకసారి పెరిగింది. ఇప్పుడు మళ్లీ పాల ధరలు భారీగా పెరిగాయి.           

 

రెండు నెలల క్రితం విజయ పాల డెయిరీ సంస్ద 3 రూపాయిలు పెంచింది. ఇప్పుడు ప్రైవేట్ పాల డెయిరీ సంస్దలు పాల రేట్లను అధికంగా పెంచేశాయి. పాల కొరత నేపథ్యంలో సంస్దలు లీటర్ కు 2 రూపాయిల నుండి 6 రూపాయిల వరుకు పెంచినట్టు తెలుస్తుంది. దీంతో టోన్డ్ మిల్క్ లీటర్ ధర ఇప్పుడు 50 రూపాయిలను దాటింది.. 

 

వెన్న శాతం అధికంగా ఉండే హోల్ మిల్క్ ధరలు కూడా లీటర్ 6 రూపాయిలు పెరిగి 68 రూపాయలకు చేరుకుంది.. నెల రోజుల్లోనే పాల ధరలు రెండు సార్లు పెరిగాయి.. ఈ ధరల పెరుగుదలతో ప్రజలపై మరింత భారం పడనుంది. ఏదైనా ధర పెరిగితే సరేలే కొనడం తగ్గిద్దాం అనుకుంటారు.. కానీ ఇది నిత్యావసరం.      

 

ఉదయం ఒక కాఫీ.. సాయింత్రం ఒక టీ లేకపోతే పూటా గడవదు.. కాఫీ తాగకపోతే చుక్కలు కనిపిస్తాయి. అందుకే ఖచ్చితంగా పాలు ఖచ్చితంగా కొనాల్సిందే.. ఇలా రోజు రోజుకు పెరుగుతూ వెళ్తే ఏది తినాలి అన్న ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి.. అలా అని తినకుండా ఉండలేము.. అది కాక.. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది.. ఇక వచ్చే ఈ రెండు, మూడు నెలలో పాల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: