ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఏ నిర్ణయం తీసుకున్నా టీడీపీకి నచ్చదు. టీడీపీ నేతలు వైసీపీ మంచి పనులు చేసినా, మంచి పథకాలు అమలు చేస్తున్నా విమర్శలు చేస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇరు పార్టీల నేతల మధ్య గొడవలు, వ్యక్తిగత దూషణలు పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్ పర్యటన ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేలా చేస్తోంది. మోదీకి దగ్గరైన జగన్ కు ఆహ్వానం అందకపోవటం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. 
 
నిన్న రాత్రి 8 గంటలకు ట్రంప్ ఇండియా పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన విందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందగా జగన్ కు మాత్రం ఆహ్వానం అందలేదు. జగన్ ను ఎందుకు పిలవలేదు అనే ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు జగన్ పై కేసులు ఉన్నాయని అందుకే ఆహ్వానం అందలేదని చెబుతున్నారు. 
 
తాజాగా జగన్ ను పిలవకపోవడానికి చంద్రబాబు కారణమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మోదీకి, చంద్రబాబుకు మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ బాబు తన పలుకుబడితో జగన్ కు ఆహ్వానం అందకుండా చేశారని, బాబు ఢిల్లీ స్థాయిలో ఎంతో కష్టపడి ఆహ్వానం అందకుండా అడ్డు పడ్డారని ప్రచారం జరుగుతోంది. బాబు ఢిల్లీ లెవెల్లో నిజంగానే జగన్ కు ఆహ్వానం అందకుండా లాబీయింగ్ చేశారా...? లేదా...? తెలియాల్సి ఉంది. 
 
మరోవైపు కొన్నిరోజుల క్రితమే జగన్ మోదీ, అమిత్ షా ను కలిసి ప్రత్యేక హోదా, శాసన మండలి రద్దు, దిశ చట్టం ఇతర అంశాల గురించి చర్చించారు. వైసీపీ ఎన్డీఏలో చేరే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మోదీ తీసుకున్న నిర్ణయాల విషయంలో జగన్ ఆచితూచి కేంద్రానికి అనుకూలంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నా జగన్ కు ఆహ్వానం అందకపోవడంతో చంద్రబాబు ఎత్తులు వేసి మేనేజ్ చేశారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: