హైదరాబాద్ మెట్రో నగర వాసులందరికీ ప్రయాణ భారాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ఎలాంటి కాలుష్యం లేకుండా మెట్రోలో హాయిగా ప్రయాణిస్తూ.. తమ తమ గమ్యాలకు చేరుకుంటున్నారు నగరవాసులు. అయితే రోజురోజుకు మెట్రో అధికారులు కూడా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేలా వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు.అయితే తాజాగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో తీపి కబురు వినిపించింది. త్వరలో మరో రెండు మెట్రోరైలు నడిపేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కొత్త రైళ్ల కు సంబంధించిన ట్రైల్స్  ఇప్పుడు జరుగుతున్నాయి నడుస్తున్నాయి..

 

 

 ఇక ఈ రైలు మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ  ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రోలో  రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో... ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మరో రెండు రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు.. ఆయన తెలిపారు. అంతేకాకుండా మెట్రో రైల్ వేగాన్ని కూడా పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు అంటూ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో మూడు మార్గాల్లో  55 రైళ్లతో  వెయ్యి సర్వీసులను నడుపుతున్నారు. మరో రెండు రైళ్లు కూడా చేరితే 57 రైళ్లతో  సర్వీసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 అలాగే ఇంకొన్ని రోజుల్లో రైళ్ల వేగాన్ని కూడా పెంచే యోచనలో ఉన్నారట హైదరాబాద్ మెట్రో అధికారులు. ఇక వేగం పెంచితే మరిన్ని సర్వీసులను కూడా పెంచేందుకు వీలుగా ఉంటుందని భావిస్తున్నారట. ఇక దీనికి సంబంధించి కమిషనర్ ఆఫ్ మెట్రోరైల్ సేఫ్టీ అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రయాణిస్తున్న మెట్రోరైల్లు  గంటకు  31 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. కాగా  ఈ 31 కిలోమీటర్ల వేగాన్ని 35 కిలోమీటర్ల కు పెంచాలని మెట్రో అధికారులు భావిస్తున్నారట. దీనికి సంబంధించి ఆగస్టు నెల వరకు అనుమతులు వచ్చే అవకాశం ఉండటంతో ఆ తర్వాత మెట్రో రైళ్ల వేగాన్ని పెంచనున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: