పోలీసులుంటే ప్రజల్లో ఉన్న దురభిప్రాయం చెరపాలని అధికారులు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికి.. కొందరు పోలీసులు చేసే చెడుపనుల వల్ల పోలీసు వ్యవస్దపై ప్రజలకు పూర్తిగా నమ్మకం ఏర్పడటం లేదు.. ఇలాంటి పరిస్దితుల్లో అక్కడక్కడ మంచి పోలీసులు కూడా ఉన్నారని కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి.. పోలీసులంటే అందరికి ఆపద్బాంధవులు, కానీ రాబంధులు కాదని తెలిపే ఈ ఘటన వివరాలు చూస్తే..

 

 

ఓ బాలిక కన్నీటినీ తుడిచిన ఈ పోలీస్ అందరి చేత శహభాష్ అనిపించుకుంటున్నాడు.. అదెలా అంటే. జైస్వాల్ బిద్యమండిర్ పరీక్షా కేంద్రానికి బాలిక కుర్రే ఆలస్యంగా చేరుకుంది. అంటే పరీక్షా పేపర్లను పంపిణీ చేయడానికి ఐదు నిమిషాల ముందు వచ్చిన ఆమెను ఇన్విజిలేటర్ అడ్డుకుని హాల్ టికెట్ చూపించమని అడిగారు. అప్పటి వరకు పరీక్ష హడావుడిలో ఉన్న ఆ అమ్మాయికి హాల్ టికెట్ ఇంట్లో మరిచానన్న విషయం అప్పుడు గుర్తుకువచ్చింది. అదే విషయాన్ని అతనితో చెప్పగా రూల్స్ ప్రకారం... అడ్మిట్ కార్డు లేకుండా అనుమతించేది లేదని చెప్పేశారు.

 

 

దాంతో పరీక్ష కేంద్రం దగ్గరే ఆ బాలిక ఏడుస్తూ ఉండిపోయింది. ఈ ఘటన అక్కడే డ్యూటీలో ఉన్నా ఉల్తాడంగా ట్రాఫిక్ గార్డ్‌కు చెందిన సార్జెంట్ మల్లిక్‌ కంట పడగా అతను ఆ అమ్మాయి వద్దకు వచ్చి బాలికను పరీక్షా రాస్తావంటూ ధైర్యం చెప్పడమే కాకుండా.. అతను బాలికను చీఫ్ ఇన్విజిలేటర్ దగ్గరకు తీసుకొని వెళ్లి పరీక్షలో కూర్చోవడానికి అనుమతించమని, అడ్మిట్ కార్డును తాను తిరిగి తీసుకువస్తానని హామీ ఇచ్చాడు. అందుకు ఆ ఇన్విజిలేటర్ కూడా అంగీకరించారు.

 

 

ఆ వెంటనే సమయం వృథా కాకుండా.. మల్లిక్ బాలిక తల్లిని సంప్రదించి, 5.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌత్ టాంగ్రా రోడ్ వద్ద ఉన్న ఆ బాలిక నివాసానికి చేరుకుని చెప్పిన సమయానికి అడ్మిట్ కార్డును తిరిగి తెచ్చి బాలికకు అప్పగించాడు. ఇక ఈ ఘటనపట్ల స్పందించిన ఆ పోలీసు పరీక్షకు కేవలం 10 నిమిషాల ముందే విద్యార్థికి సహాయం చేయగలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.. ఇదే కదా అసలైన పోలీస్ కర్తవ్యం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: