ఎక్కువ అందంగా కనిపించడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ యవ్వనంగా కనిపించేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఏది పడితే అది తినకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొంతమందిలో త్వరగా వృద్ధాప్యం ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. కొంత మందికి వయస్సు మీద పడినా యవ్వనంగా నే కనిపిస్తుంటారు. ఇక ఎవరైనా ఎందుకు ఇలా జరిగింది అంటే మాత్రం ఇది వంశపారంపర్యంగా వచ్చిన జీన్స్ కారణంగానే అంటూ చేతులు దులిపేసుకున్నారు. కానీ రోజు వారి ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నిత్య యవ్వనంగా ఉండవచ్చు అని  పరిశోధకులు చెబుతున్నారు

 

 

 ఎలాంటి ముడుతలు లేకుండా... వృద్ధాప్యానికి దూరంగా ఉండవచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల ఇది సాధ్యం అవుతుంది అంటున్నారు పరిశోధకులు. అయితే తీసుకోవాల్సిన ఆహారంలో ముఖ్యంగా పాలకూర బాదంపప్పు బొప్పాయి ఎరుపు క్యాప్సికం టమాటాలను ఆహారంలో తీసుకోవాలి అని సూచిస్తున్నారు. అయితే ఎక్కువగా ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా ఎప్పుడు యవ్వనంగా ఉండి వృద్ధాప్య ఛాయలకు దూరంగా ఉండవచ్చు అని పరిశోధకులు సూచిస్తున్నారు. ఎందుకంటే పాలకూర లోని యాంటీఆక్సిడెంట్లు సి విటమిన్ చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. వృద్ధాప్య ముడతల ను తొలగించే గుణం పాలకూరలో ఉంది. నిత్యం ఆహారంలో పాలకూరను తీసుకోవడం ద్వారా.. చర్మం ఎప్పుడు తాజాగానే ఉంటుంది. 

 

 

 ఇక బాదంపప్పు ద్వారా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా చర్మం పై ముడతలు పడకుండా చేస్తుంది బాదంపప్పు. బాదంపప్పు లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందుకే బాదం పప్పు తినడం వల్ల బాదం నూనె వాడడం వల్ల కానీ చర్మం ఎప్పుడూ మృదువుగా ఫ్రెష్ గా వృద్ధాప్య ఛాయలకు దూరంగా ఉంటుంది. ఇక టమాటాలు తినడం ద్వారా కూడా చర్మం ఎప్పుడు తాజాగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. టమాటా లోని లైకోపిన్... ముడతలు పడకుండా కాపాడుతుంది. నిత్యం ఆహారంలో టమోటాలను తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారిపోతుంది. ఇక ఎరుపు క్యాప్సికం లోని సి విటమిన్  చర్మాన్ని రక్షించి  వృద్ధాప్యానికి  దూరంగా ఉంచుతుంది. ఇక బొప్పాయి పండును చర్మానికి మాస్క్ వేసుకుంటే చర్మం ఎప్పుడూ తాజాగా నిగనిగలాడుతూ ఉంటుంది. బొప్పాయి లో పొటాషియం ఏ విటమిన్ చర్మం ఎప్పుడు ఫ్రెష్ ఉండటంతోపాటు మృదువుగా వృద్ధాప్య చాయలకు దూరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: