ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేది పాత సామెత. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఎన్ని పిట్టలు రాలిపోతాయో కొంతకాలం ఆగితే కానీ తెలీదు.  పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనే అతిపెద్ద పథకాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఉగాది పండుగ సందర్భంగా అంటే మార్చి 25వ తేదీన లాంచ్ అవ్వబోతున్న ఈ పథకంలో 25 లక్షల మంది పేదలకు ఇళ్ళపట్టాలను పంపిణీ చేయటమే టార్గెట్ గా జగన్ పెట్టుకున్నారు.

 

సరే రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ళపట్టాల పంపిణీ ఎలాగున్నా రాజధాని పరిధిలో మాత్రం పథకం అమలు విషయంలో కాస్త టెన్షన్ మొదలైంది. ఎందుకంటే రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం  చేతిలో ఉన్న వేలాది ఎకరాల భూమిలో 1251 ఎకరాలను పట్టాలుగా మార్చి పేదలకు పంపిణి చేయటానికి మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. 1251 ఎకరాలను సుమారు 54307 మంది లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.

 

అంటే అప్పట్లో రైతులు రాజధాని కోసం ఇచ్చిన భూమిలో కొంత భాగాన్ని ఇపుడు జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ళపట్టాలుగా మార్చి పంపిణీ చేయబోతోంది. అంటే అసలైన ప్రజా రాజధాని అంటే ఇదే అని జగన్ చంద్రబాబునాయుడుతో పాటు ప్రతిపక్షాలకు చెప్పదలచుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు కలల రాజధాని భ్రమరావతి పూర్తయ్యుంటే ఎగువ మధ్య తరగతి జనాలకు కూడా అందులోకి ప్రవేశించే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే  అమరావతిని ప్రధానంగా ఓ (కమ్మోళ్ళ) గేటెడ్ కమ్యూనిటిగా మార్చేయాలని అనుకున్నారు. కాకపోతే ఆచరణలో ఫెయిలయ్యారు లేండి.

 

అదే జగన్ మాత్రం ఇపుడు అదే ప్రాంతంలో 54 వేలమందికి ఇళ్ళ పట్టాలు పంపిణి చేస్తున్నారు. వాళ్ళంతా ఇళ్ళు కట్టుకుంటే అతిపెద్ద రెసిడెన్షియల్ ఏరియా అవుతుందనటంలో సందేహం లేదు. ఒక్కసారిగా 1251 ఎకరాల్లో సుమారు 1.6 లక్షల మంది ఉంటున్నారంటే అంతకన్నా కావాల్సిందేముంది ? పథకం దిగ్విజియంగా అమలైతే అప్పుడు తెలుస్తుంది జగన్ దెబ్బకు ఎన్నిపిట్టలు రాలిపోతాయో.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: