ఒక వ్యక్తి మనసు రోజుకు 60 వేలకు పైగా ఆలోచనలు చేస్తూ ఉంటుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. అయితే మన మనసుకు వచ్చే ఆలోచనలలో 90 శాతం పాత ఆలోచనలే పునరావృతం అవుతాయని మానసిక శాస్త్ర వేత్తలు చెపుతున్నారు. వాస్తవానికి మనం ప్రతిరోజు ఏవిషయం గురించి ఆలోచనలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటామో ఆ ఆలోచనలే మన జీవితంలో యదార్థ సంఘటనలుగా మారుతాయి.


అందుకే అణు బాంబుకన్నా శక్తివంతమైనది మనిషి ఆలోచన అని అంటారు. మనిషి అభివృద్ధి సాధించడంలో జీవన ఫలాలు అందుకోవడంలో ప్రభావితం చేసేవి ఒక వ్యక్తి ఆలోచనలు మాత్రమే. సంపద సృష్టి మన నిరంతరం సాగే ఆలోచనల సాంద్రతను బట్టి ఉంటుందని మానసిక శాస్త్ర వేత్తల అభిప్రాయం. మనకు బలమైన ఆలోచనలు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆలోచనలు లక్ష్యాలుగా మారి ఆ తరువాత విజయం వైపు దూసుకు వెళ్ళి విజేతలుగా మారి ఆపై ఐశ్వర్య వంతులుగా మారగాలుగుతారు.


అందుకే మన ఆలోచనలను నియంత్రించుకునే శక్తిగల వారి దగ్గరకు మాత్రమే సంపద వచ్చి చేరుతుంది. వాస్తవానికి యదార్ధంగా ఆలోచిస్తే మనిషి జీవితం చాల చిన్నది. దీనితో వృత్తి పరంగా ఎదుగుతూ తద్వారా ధనవంతులుగా మారాలి అంటే ఖచ్చితంగా మన ఆలోచనల పై నియంత్రణ ఉండి తీరాలి. ప్రపంచ విఖ్యాత శాస్త్రవేత్త ఐన్ ష్టీన్ తో సహా ప్రతి మనిషి తన ఆలోచనా శక్తిలో అతడి జీవితంలో కేవలం పది శాతం మాత్రమే వాడుతున్నారని ఒక అద్యయనం తెలియ చేస్తోంది.


కట్టలు తెంచుకుని ప్రవహించే ఒక ఉప్పెనలా వచ్చే మన ఆలోచనలను నియంత్రించగల వ్యక్తి దగ్గర మాత్రమే సంపద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శాస్త్రజ్ఞులు మనిషి మెదడు పై అతడి ఆలోచనల పై అనేక ఆలోచనలు చేస్తున్న పరిస్థితులలో మన జీవితం మన సంపద మన ఐశ్వర్యానికి అదేవిధంగా మనం పొందే ఫలితాలకు ఆలోచనలే సంపదకు బీజాలు అని తెలుసుకున్న వ్యక్తి మాత్రమే ఐశ్వర్య వంతుడు కాగలుగుతాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: