తన పుత్రరత్నం నారా లోకేష్ ను  కుప్పానికి మాత్రమే చంద్రబాబునాయుడు పరిమితం చేయబోతున్నారా ?  క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. కుప్పంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైనే అందరిలో చర్చలు జరుగుతున్నాయి. తొందరలో లోకేష్ నియోజకవర్గంలో క్యాంపు వేస్తాడని, నియోజకవర్గం మొత్తం పర్యటిస్తాడని చంద్రబాబు చెప్పటమే ఇపుడు సంచలనంగా మారింది.

 

నిజానికి కుప్పంలో లోకేష్ పర్యటిస్తాడని చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నుండి కుప్పం నియోజకవర్గం కూడా పుత్రరత్నానికి కుటుంబ ఆస్తిగా సంక్రమిస్తుందనటంలో ఎవరికీ సందేహం లేదు. మరి ఇంతోటి దానికి ప్రత్యేకంగా ప్రకటించాల్సిన అవసరం ఏమిటి ? ఏమిటంటే తొందరలో మున్సిపల్, సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ప్రస్తుత పరిస్ధితి చూస్తే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా తెలుగుదేశంపార్టీ పుంజుకున్నట్లు కనబడటం లేదు. పైగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనపై చంద్రబాబు, టిడిపి చేస్తున్న యాగీతో పార్టీకి మైనస్ అయ్యిందనే అనుకుంటున్నారు. కేవలం రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల అభివృద్ధి కోసమే చంద్రబాబు యావత్ రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయాలని అనుకున్నట్లుగా చర్చ జరుగుతోంది.

 

దాంతో జగన్ ప్రకటనపై చంద్రబాబు నానా గోల చేస్తున్నారే కానీ మిగిలిన టిడిపి నేతల్లో అంత వ్యతిరేకత కనబడటం లేదు. ఈ పరిస్ధితుల్లో రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో చంద్రబాబు  రాష్ట్రమంతా పర్యటించినా ఏమి ఉపయోగం ఉంటుందో అనుమానమే.  మరి తండ్రి పర్యటపైనే అనుమానాలుంటే ఇక లోకేష్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరపుడు పుత్రరత్నం ఏమి చేస్తాడు ? ఏమి చేస్తాడంటే కుప్పం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైపోతాడనే  చర్చ పెరిగిపోతోంది. బాల మేధావి లోకేష్ ను రాష్ట్రమంతా పర్యటనకు పంపితే ఏమవుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే నేతలు కూడా తమ ప్రాంతాల్లో లోకేష్ కాకుండా చంద్రబాబే పర్యటించాలని కోరుకుంటున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: