కూతురుగా చూసుకోవాల్సిన మామ కోడలిపై కన్నేశాడు.. అడ్డుకోవాల్సిన అత్త తన మొగుడికే సపోర్ట్ చేసింది. పైగా ఇందులో పెద్ద తప్పేముంది.. నీ మొగుడు మాత్రం టూర్లకెళ్లి ఆడాళ్లతో ఎంజాయ్ చేయడం లేదు.. వాడు ఎలాగూ లేడు కదా.. నా మొగుడు నీతో ఎంజాయ్ చేస్తే తప్పేంటి.. మామకు సహకరించి గుట్టుగా సంసారం చేసుకో.. లేకపోతే.. నీకు ఇక పుట్టిళ్లే గతి.. ఇదీ ఓ అత్త బెదిరింపులు.

 

చివరకు కట్టుకున్న మొగుడు కూడా మా నాన్నకు కాస్త కోపరేట్ చేస్తే నీ సొమ్మేంపోతుందీ అంటూ చిరాకుపడటం మొదలుపెట్టాడు. ఇదేదో సినిమా కథ కాదు.. వాస్తవంగా జరిగిన ఘటన.. అదీ ఎక్కడో కాదు.. మన గుంటూరులోనే.. దీంతో బేజారెత్తిపోయిన ఆ కోడలు.. చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆమె పోలీసులకు ఏమని కంప్లయింట్ ఇచ్చిందో చూడండి..

 

నేను ఎంబీఏ చదువుకున్నా. గుంటూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి కుమారుడితో వివాహం చేశారు. కట్నంగా రూ. 40 లక్షలు, కిలో బంగారం, కారు, ఇంటి సామగ్రికి మరో రూ. 20 లక్షలు ఇచ్చారు. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత అర్ధరాత్రి సమయంలో మామయ్య వచ్చి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కేకలు వేయడంతో అత్తింటివాళ్లు వచ్చి కాపురం గుట్టుగా చేసుకోవాలి లేకపోతే పుట్టింటికి పంపిస్తామని బెదిరించారు. అత్తకు చెబితే ఇవన్నీ ఉన్నత కుటుంబాల్లో సహజమేనంటూ చెప్పడంతో నిర్ఘాంతపోయాను.

 

ఈవిషయం మా పుట్టింటి వాళ్లకు చెప్పాను. వాళ్లు వచ్చి మాట్లాడితే అలాంటిది ఏమీ లేదన్నారు. గర్భవతిగా ఉన్న నేను ఆడపిల్లకు జన్మనిచ్చాను. కొద్ది రోజుల తర్వాత నా భర్త టూర్‌కు వెళ్లిన రోజు రాత్రివేళ మామయ్య నా గదిలోకి వచ్చి తనకు సహకరిస్తే నా కాపురం నిలపెడతానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన నేను నా పాపతో సహ బయటకు వచ్చేశాను. అత్తకు చెపితే ఆమె తన భర్తను సమర్థించింది. అదేమంటే నీ భర్త టూర్లకు వెళ్లి అక్కడ ఎంజాయ్‌ చేయడం లేదా అంటూ ప్రశ్నించింది.

 

విషయమంతా భర్తకు చెపితే నాపై కోపగించుకొని కట్టుబట్టలతో పుట్టింటికి గెంటేశాడు. ఈ విషయంపై మా తల్లిదండ్రులు నిలదీస్తే నాకు ఆడపిల్లల పుట్టింది కాబట్టి రూ. కోటి అదనపు కట్నం ఇవ్వాలని లేకపోతే తన కుమారుడికి మరో పెళ్లి చేస్తామంటూ బెదిరించారు. అంతేకాకుండా మామ నాతో అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాలు బయటపెడితే నన్ను, నా కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారు. విచారించి నా మామయ్యపై చర్యలు తీసుకొని భర్తతో నా కాపురం నిలపెట్టాలని కోరుతున్నాను అంటూ గుంటూరు అర్బన్‌ ఏఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఏఎస్పీ విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: