ఇప్పుడు నేరస్తులు బాగా ముదిరిపోయారు. దొంగతనాలు, దోపిడీలు ఇలాంటివి చేయాలంటే చాలా టైమ్ వేస్ట్.. చాలా కష్టపడాలి. అలా కాకుండా జనం అవసరాలతో, వీక్ నెస్ లతో సంపాదించడానికి అనేక మార్గాలు కనిపెడుతున్నారు. చివరకు ఆపదలో ఉన్న వారిని సైతం వదల కుండా సైబర్ వలకు బలి చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

 

ఓ యువతి ఆర్థిక ఇబ్బందులలతో ఉంది. ఏదైనా జాబ్ దొరకకపోతుందా అంటూ ఇంటర్నెట్ లో వెదుకులాట ప్రారభించింది. ఆ సమయంలో కిడ్నీ దానం చేస్తే 25 లక్షలు ఇస్తామంటూ ఓ వెబ్‌సైట్‌లో ప్రకటన కనబడింది. వెంటనే ఫోన్ చేసింది.

 

ది నేషనల్ కిడ్నీ ఫౌండేషన్‌లో పేరు నమోదు చేసుకునేందుకు 10 వేల రూపాయలు చెల్లించాలని సదరు కేటుగాడు సమాధానమిచ్చారు. మోసం అని గ్రహించలేక పోయిన ఆమె డబ్బు జమ చేసింది. ఆ తర్వాత ఆ ఫీజు.. ఈ టెస్టు కోసం ఫీజు అంటూ మొత్తం ఆమె నుంచి నిందితులు లక్షా 20 వేల రూపాయలు దోచేశారు. రకరకాల ఫీజుల పేరుతో ఇంకా నగదు కావాలని అడగటంతో యువతికి అనుమానం వచ్చింది.

 

విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ నెంబర్, బ్యాంక్ ఖాతాల ఆధారంగా కిడ్నీ విక్రయాల పేరుతో నగదు దోచుకుంటున్న సైబర్ నేరస్తుల పనేనని పోలీసులు తేల్చారు. మనీ వ్యాలెట్లు, బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసి చేసారు. వాటి నుంచి 90 వేల రూపాయల నగదు తీసి బాధితురాలికి అందజేశారు. నిందితులు దోచుకున్న మొత్తంలో మిగిలిన మొత్తాన్ని వీలైనంత త్వరగా బాధితురాలికి అందేలా చూస్తామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: