సర్వమత సమ్మేళనంగా ఉండే భారతదేశంలో ఇప్పుడు మత, కుల ఘర్షణలు ఎక్కువయ్యాయి. ఒకరిమీద ఒకరు విద్వేషాలు పెంచుకొని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. దీనికి రాజకీయ కారణాలు అధికంగా కనిపిస్తున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వెనక ఉండి కొంతమంది నాయకులు వీటిని నడిపిస్తున్నారని అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఢిల్లీ అల్లర్లు ప్రస్తుతం ఢిల్లీలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఈశాన్య ప్రాంతంలో జరుగుతున్నాయి .ఇప్పటి వరకు ఈ అల్లర్లలో 13 మంది వరకు చనిపోయినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇందులో పోలీసులు కూడా ఉన్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీ రావణకాష్టంగా మారిపోయింది.

 

IHG


 ప్రభుత్వ, ప్రవేటు అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున షాపులను, కార్యాలయాలను ఆందోళనకారులు తగులబెట్టారు. దీంతో ఈ అల్లర్లను ఆపేందుకు పెద్ద ఎత్తున బలగాలను దించారు. కార్యాలయాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇంటర్ నెట్ కూడా నిలిపివేశారు. దీనంతటికీ కారణం సీఏఎ చట్టమే. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినా  మీడియాలో ఫోకస్ అవ్వకపోవడానికి కారణం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఉండడమే. సిఏఏకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు ఆందోళన చేయడంతో తో ఢిల్లీలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక వర్గం వారు కనిపిస్తే మరో వర్గం వారు కర్రలతో దాడులు చేయడం, పరిగెత్తించి మరీ కొట్టడం ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఎన్నో ఢిల్లీలో చోటుచేసుకున్నాయి.


 ప్రైవేట్ ఆస్థులు ధ్వంసం అయ్యాయి. వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఢిల్లీ ఈశాన్య ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి భద్రత దళాలు తీసుకున్నాయి. ఇక్కడ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు ఎవరిని బయటకు రావొద్దంటూ  పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కనిపిస్తే కాల్చివేత ఆర్డర్లు ఢిల్లీలో జారీ అయినట్లు ప్రచారం జరుగుతున్నా... అందులో నిజం లేదని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: