చావు అనేది ఎవరికైనా తప్పదు.. కాని కొందరు మాత్రం చావు అంచులకు వెళ్లగా ఆ దృష్యాన్ని చూసేవారు ఇక వీడి పని అయిపోయింది అని అనుకునే లోపే మళ్లీ బ్రతికి బయటపడతారు.. నిజంగా ఇదొక ఆశ్చర్యకరమైన ఘటన అనుకోవచ్చూ.. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు చిన్న విషయాల్లో అంటే కోడి గుడ్డు తినగా గొంతులో ఇరుక్కుని, లేదా మంచంపై నుండి పడి ఇలాంటి చిన్న విషయాలకే మరణించిన వారున్నారు..

 

 

ఇక మరికొందరి విషయాల్లో మాత్రం ఇలా జరగదు.. వారు తెగి రెండుముక్కలైనా బ్రతికి బట్టకడతారు.. ఇలాంటివారిని చూసినప్పుడు వీడు మృత్యుంజయుడురా అంటారు.. నిజంగా అంత పెద్ద ప్రమాదాల్లో చిక్కుకున్న బ్రతకడం ఒకింత నమ్మశక్యం కాని విషయం.. ఇలాంటి వారికి ఈ భూమి మీద ఇంకా నూకలు బాకీ ఉంటేనే అది సాధ్యం.. ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటి అదృష్టాన్నే పొందాడనుకుంటా.. ఆ యమున్ని కళ్ళముందు చూసి, అతని యమపాశం నుండి తప్పించుకుని బయటపడ్డాడు..

 

 

ఆ వివరాలు తెలుసుకుంటే.. పశ్చిమ బెంగాల్‌ కు చెందిన ఓ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుడు కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి తృటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. వెంట్రుక వాసిలో తప్పిన అపాయం నుండి బయటపడి పునర్జన్మ ఎత్తాడనుకుంటున్నారు.. ఇతను కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించడంలో పొరపాటుగా జారిపడగా అతడి తల ప్లాట్‌ఫాంకు – రైలు మధ్య ఇరుక్కుంది.

 

 

అయితే ఫ్లాట్ ఫామ్ మీద ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మెరుపువేగంతో ఒక్క ఉదుటున ప్రయాణికుణ్ని పట్టుకొని పక్కకి లాగాడు. దీంతో ఆ ప్రయాణికుడు ప్రాణాల్ని దక్కించుకున్నాడు. లేకపోతే అతడి తల రైలు బోగీలకు తగిలి చిధ్రమయ్యేది. ఇక ఈ దృష్యాలన్ని అక్కడి సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అయ్యాయి.. అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి సాహసాలు పనికి రావు.. మన స్దాయి ఎంతవరకో అంతవరకే అడుగు కదపాలి.. ఈ రైలు మిస్సైతే మరో రైలు కానీ ప్రాణాలు పోతే తిరిగి రప్పించలేము కదా.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: