తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ వార్నింగ్ లతో హడావుడి చేస్తున్నారు. గత కొంతకాలంగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనదైన శైలిలో ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్న కేటీఆర్ దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే వ్యవహరిస్తున్నారు. తన దృష్టికి వచ్చిన చిన్న సమస్యలను కూడా వదలకుండా పరిష్కారం అయ్యేలా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రజానాయకుడిగా ముద్ర వేయించుకోవాలని కేటీఆర్ తహతహలాడుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 


పాలనలోనూ,  పార్టీలోనూ ఎక్కడా తన పట్టు చేజారిపోకుండా నడుచుకుంటున్నాడు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు, అధికారులకు ఇలా అందరికీ ప్రజా సంక్షేమం విషయంలో నిబద్ధతతో  పనిచేయాలని, అలక్ష్యం చేస్తే ఎవరినీ ఉపేక్షించబోమని కేటీఆర్ పదేపదే చెబుతున్నారు. పార్టీ శ్రేణులకు, మున్సిపల్ కార్పొరేటర్లు, చైర్మన్ లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్ ఇప్పుడు కాంట్రాక్టర్లను కూడా ఆ విధంగానే వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా జిహెచ్ఎంసి కేంద్ర కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల తో కేటీఆర్ ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి అధికారులకు కాంట్రాక్టర్లకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

 

IHG

 

 చైనాలో పదిరోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించారని, కానీ మన దగ్గర అలా నిర్మించాలంటే సంవత్సరాలు పడుతుందని, దీని కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆయన కాంట్రాక్టర్లపై అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణాల విషయంలో నిబంధనల ప్రకారం ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.' మీ వల్ల అయితే చేయండి వదిలేయండి' ఇక తెలంగాణలో ఎక్కడా కాంట్రాక్టులు చేయలేరు అంటూ కేటీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తనకు సాకులు చెప్పవద్దని, పని చేసి చూపించాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 


ఈ సందర్భంగా చైనా గురించి మరోసారి కేటీఆర్ అధికారులకు కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. పదిరోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రి చైనా ఎలా నిర్మించిందో అదే సాంకేతికతను మనం కూడా అందిపుచ్చుకోవాలని. అవసరమైతే ఒకసారి చైనా వెళ్లి ఆ విధానాన్ని గురించి సమగ్రంగా పరిశీలించి రావాలంటూ కేటీఆర్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: