అవినీతి మరక అంటని నాయకుడు లోకంలో దాదాపుగా లేరు.. ఇతరులను బాధపెట్టకుండా, అన్యాయం చేయకుండా బ్రతుకుచున్న మనిషిలేడు.. ఒకప్పుడు ఇలాంటి చర్యలు పాపపు పనులుగా భావించిన ఈ లోకంలో, ఇప్పుడు ఇవే పనులను ఇంటి అడ్రసులుగా మార్చుకుని బ్రతుకుతున్న వారు ఉన్నారు.. పొద్దున లేచిన దగ్గరినుండి పక్కలోకి చేరేవరకు చేయని పాపాలు ఉండటం లేదు..

 

 

ముఖ్యంగా రాజకీయం, రాక్షసక్రీడగా మారింది.. ఇకపోతే మన నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం మామూలే... ఇక అవినీతి నేత అంటూ ప్రత్యర్థిని వేలెత్తి చూపితే మరివారి చరిత్ర ఏమిటి? దాన్నిమిగిలిన వారు ప్రశ్నించారా ? కాని ఇప్పుడు ఇలాంటివేమి పట్టించుకోవడం లేదు మన నాయకులు.. ఇకపోతే పట్నంగోస పేరుతో మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమం, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించారు. కాగా ఈ సందర్భంగా వనస్థలిపురం, మన్సూరాబాద్​, నాగోల్​, హయత్​నగర్​ లలో డబుల్​ బెడ్​రూం ఇండ్లను పరిశీలించి మాట్లాడుతూ, టీఆర్​ఎస్​ నాయకులు కబ్జా చేసిన భూములతో 10లక్షల మందికి డబుల్ బెడ్​రూం ఇండ్లు ఇవ్వొచ్చని రేవంత్​రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు..

 

 

ఇప్పటి వరకు డబుల్ బెడ్​రూం ఇండ్లు పూర్తి కాకపోవడానికి కారణం టీ‌‌ఆర్‌‌ఎస్ ప్రభుత్వ అవినీతని, ప్రధాన మంత్రి ఆవాస్​యోజన పేరుతో కేంద్రం ఇస్తున్న వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఇదే కాకుండా ఈ పథకం పేరిట గల్లీల్లో ఉండే టీ‌‌ఆర్‌‌ఎస్ నాయకులు  పైసలు వసూలు చేస్తున్నారన్నారని ఆరోపించారు..

 

 

లబ్ధిదారులకు న్యాయం జరగకపోతే అందరితో కలెక్టరేట్ ​ముట్టడించి, ఎన్నిరోజులైనా అక్కడే ఉంటామని, అన్నం తిన్న ఆకులను కలెక్టర్​ కుర్చీలో పెట్టి నిరసన తెలుపుతామని హెచ్చరించారు.. ఇకపోతే ఇప్పటికే రాష్ట్రంలో అవినీతి చాలా పెరిగిపోయిందని గల్లి లీడర్లు కూడా కార్లను కొనుక్కునే స్దాయికి ఎదిగారని, ఇదంతా గులాభిపార్టీ పుణ్యమని, దీనిబట్టి తెలుస్తుంది.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవినీతి.. అని విమర్శించారు రేవంత్ రెడ్డి..

మరింత సమాచారం తెలుసుకోండి: