ప్రత్యర్ధుల మీద బురద చల్లేస్తు తెలుగుదేశంపార్టీ నేతలు తప్ప ఇంకెవరూ ఈ స్ధాయిలో మాట్లాడలేరేమో ? అందులోను మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ తర్వాతే ఇంకెవరైనా. ఇంతకీ విషయం ఏమిటంటే ఈరోజు మీడియాతో ఈమె  మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మీద కేసులున్న కారణంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గౌరవార్ధం ఇచ్చిన విందుకు పిలవలేదని చెప్పింది. వైసిపి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళపైన ఉన్న కేసుల కారణంగానే జగన్ కు ఆహ్వానం అందలేదట.

 

అలాగే దావోస్ లో జరిగిన  ప్రపంచ ఆర్ధిక సదస్సుకు జగన్ ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే కేసుల కారణంగా అరెస్టు భయంతోనే అట. ఇప్పటికే జగన్ సన్నిహితుడైన నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్టు చేసిన సెర్బియా పోలీసులు జగన్ ను అరెస్టు చేయటం కోసం వెయిట్ చేస్తున్నారట. అరెస్టుకు భయపడే జగన్ దావోస్ కు కూడా వెళ్ళలేదట. మరి దావోస్ కు సెర్బియాకు ఏమిటి సంబంధమో ఆమె చెప్పాలి.

 

ట్రంప్ విందు సందర్భంగా 95 మందికి ఆహ్వానం అందితే అందులో తాను ఎందుకు లేరో జవాబు చెప్పాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందట. ఆహ్వానం అందని కారణం ఆమె చెప్పేసి మళ్ళీ కారణమేంటో జగన్ చెప్పాలని నిలదీయటం ఆమెకు చెల్లుతుంది.  పైగా ఇపుడు గనుక ముఖ్యమంత్రిగా జగన్ స్ధానంలో చంద్రబాబునాయుడు ఉండుంటే ట్రంప్ ముందుగా గుజరాత్ కు కాకుండా ఏపికే వచ్చి ఉండేవాడని కూడా అనూరాధ చెప్పటం చాలా విచిత్రంగా ఉంది. అనూరాధ మాటలు వింటుంటే మీడియా వాళ్ళ చెవుల్లో నెత్తురు కారుతోందేమో ?

 

మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు, టిడిపిని చావు దెబ్బ కొట్టాడాన్న కసి జగన్ పై వీళ్ళల్లో పేరుకుపోయిందన్నది వాస్తవం. కానీ దాన్ని మనసులో పెట్టుకుని ఇంత అసహ్యంగా బురద చల్లేయటమేంటో అనూరాధకే తెలియాలి.  దావోస్ కు రెగ్యులర్ గా వెళ్ళిన చంద్రబాబు పెట్టుబడిదారులతో మాట్లాడి పెట్టుబడులు పెట్టారని చెప్పింది. మరీ విచిత్రమేటంటే చంద్రబాబు ఏపికి రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారట.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: