ఇప్పుడు ఎన్ని యాత్రలు చేసినా... ఎన్ని దండయాత్రలు చేసిన వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీలేదు. ఇంకా ఆ పార్టీకి ప్రజలను పాలించే అవకాశం నాలుగేళ్లు ఉంది. ఇంకా ఆ పార్టీ మీద, ఆ పార్టీ అధినాయకుడు జగన్ మీద జనాలకి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. రోజుకో కొత్త పథకం ప్రకటించుకుంటూ..  ఆదరణ పెంచుకుంటూ జగన్ ముందుకు వెళ్లిపోతున్నాడు. ఈ సమయంలో బస్సు యాత్ర పేరుతో చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోరు అనేది ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళ ఆలోచన. 70 ఏళ్ల వయస్సులో విశ్రాంతి తీసుకోవడం మానేసి ఇంత హడావిడి చేయడం ఏంటి ?  దీని వల్ల పార్టీకి ఏమైనా అధికారం ఇప్పటికిప్పుడు వచ్చేస్తుందా  అంటూ సొంత పార్టీ నాయకులు ఇప్పుడు విమర్శిస్తున్నారు. 


పై స్థాయి నాయకుల మాట ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం టిడిపి కార్యకర్తలు ఇదేరకమైన ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మనం ఎంత హడావుడి చేసినా ఎవరూ పట్టించుకోరని, అనవసరం శ్రమ తప్ప ఏమీ ఉపయోగం ఉండదని వారంతా భావిస్తున్నారు. తాజాగా విశాఖలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర కు సంబంధించి సన్నాహక కమిటీ పేరుతో టిడిపి నాయకులు సమావేశం నిర్వహించగా, పార్టీలో ఉన్న కొంతమంది నాయకులతో పాటు కార్యకర్తలు కూడా పెద్దగా స్పందించలేనట్టు తెలుస్తోంది. చంద్రబాబు మాత్రం ఏదో రకంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లి కార్యకర్తల్లో ధైర్యం నూరిపోయాలని చూస్తున్నాడు.

IHG


 తమ్ముళ్లు మాత్రం చంద్రబాబు యాత్ర పేరుతో సొంత జేబులకు చిల్లు పెట్టుకోవాల్సి వస్తుంది అని, బాధపడిపోతున్నారట. ఇప్పుడు పార్టీకి ఖర్చుపెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని, ఎవరూ పట్టించుకోరని, ఈ లోపల తొందరపడి చేతి చమురు  వదిలించుకోవడం ఎందుకు అని వారంతా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు బస్సు యాత్ర యాత్రపై తెలుగు తమ్ముళ్ళు ఈ విధంగా స్పందిస్తుంటే అధినాయకుడు చంద్రబాబు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా యాత్ర పేరుతో జనాల్లో తిరిగితే తెలుగుదేశం పార్టీకి మైలేజ్ పెరుగుతుందని ఆపసోపాలు పడుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: