ఇటీవల రోడ్డు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు మరియు రోడ్లు వేసిన అతివేగం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువతీ యువకులు సరదా వల్ల చేసే డ్రైవింగ్ చాలామంది కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఇంకా కొన్ని ప్రమాదాలు అయితే డ్రైవర్ తాగుబోతు తనం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి ఘటన ఒకటి రాజస్థాన్ లో జరిగింది. అది కూడా పెళ్లి బస్సు కావటంతో జరిగిన యాక్సిడెంట్ వల్ల 24 మంది చనిపోవడం అందరినీ కలచివేసింది. బయటకు వచ్చిన వార్తలను బట్టి చూస్తే ఇటీవల రాజస్తాన్ లో జరిగిన ఒక ప్రమాదంలో 24 మంది మరణించారు. వారంతా ఒక పెళ్లి బృందం వారు. పెళ్లి వేడుకలకు ఒక బస్ లో ఈ బృందం వెళుతుండగా, బస్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. బూండీలోని కోట లా ల్ సౌత్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

 

మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నారు. ఇప్పటివరకు కనీసం 24 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు అంటున్నారు. దీంతో పోలీసులు మరియు ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు యాక్సిడెంట్ కి గురైన మిగతా వారిని బస్సులో నుండి బయటకు తీయటానికి సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

బస్సు ఘోరంగా ప్రమాదానికి గురి కావడంతో చాలామంది శరీరాలు ఆ బస్సు సీట్ల మధ్య ఇరుక్కుపోయాయి. దీంతో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్లు కూడా వాళ్లని బయటకు తీయటానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క వాళ్ల అరుపులతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మొత్తం బస్సులో ప్రయాణించే వాళ్లంతా కుటుంబ సభ్యులు కావటంతో పైగా పెళ్లి సమయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఆ ఘటన చూసిన చాలామంది తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: