అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ఇండియాలో పర్యటన చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు రోజులపాటు పర్యటించిన ప్రదేశం సందర్శించారు. అంతేకాకుండా ఇండియా గురించి మోడీ గురించి ఎన్నో ప్రశంసలు కూడా కురిపించార అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డోనాల్డ్  ట్రంప్  పర్యటనలో భాగంగా కీలక ఒప్పందాలు కూడా జరిగాయి.  అయితే డోనాల్డ్ ట్రంప్ రెండో రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విందుకు  కొంతమంది కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..పలు  రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 

 


 అయితే ఈ విందులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను  పిలిచినప్పటికీ ఈ విందుకు మాత్రం హాజరుకాలేదు. అయితే దీనిపై ఎందుకు హాజరు కాలేదు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే మాత్రం తమ అధిష్టానం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు హాజరు కావద్దు  అని చెప్పింది అంటూ మన్మోహన్ సింగ్ అంటున్నారు. మరి అధిష్టానం విందుకు ఎందుకు హాజరు కావచ్చు అని చెప్పింది అంటే... డోనాల్డ్ ట్రంప్ తో విందుకు తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి  పిలుపు రాలేదు అంటూ మన్మోహన్ సింగ్ అంటున్నారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు మాత్రం మండిపడుతున్నారు. సోనియా గాంధీని ఏ కోటాలో  అంటూ ప్రశ్నిస్తున్నారు. 

 


 సోనియాగాంధీ ప్రధానమంత్రి కాదు... లేదు ఎంపీలను కూడా పిలవాలి అంటే చాలా మంది ఎంపీలను పిలవాలి.. ఏ హోదాలో పిలవాలి అని ప్రశ్నిస్తే.. యూపీఏ చైర్ పర్సన్ హోదాలో పిలవాలి అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఒకవేళ యూపీఏ చైర్ పర్సన్ హోదాలో సోనియాగాంధీని పిలిస్తే ఇంతకు ముందు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్న చంద్రబాబును పిలవాల్సి వస్తుందని అంతేకాకుండా ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నది జార్జ్ ఫెర్నాండో ను  కూడా పిలవాల్సి వస్తుంది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ను  అంటే మాజీ ప్రధాని కోటలో రాష్ట్రపతి ఏర్పాటుచేసిన విందుకు  పిలుస్తారు.. కానీ మిగతా వాళ్ళని పిలవడానికి ఉండదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: