ప్రస్తుతం చైనా దేశానికి కరోనా  వైరస్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్ నగరంలో గుర్తించబడిన ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ ప్రస్తుతం అందరినీ కాటికి చేరుస్తుంది. ఇప్పటికే ఈ కరోనా  వైరస్ కారణంగా రెండు వేల మందికిపైగా మృత్యువాత పడగా.... 70 వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. అయితే అధికారికంగా మృతుల సంఖ్య కేవలం రెండు వేల మంది ఉన్నప్పటికీ అనధికారికంగా మాత్రం ఎన్నో వేల సంఖ్యలో మృతుల సంఖ్య ఉండొచ్చునని అభిప్రాయపడుతున్నారు.అటు  ప్రపంచ దేశాలను కూడా ఈ ప్రాణాంతకమైన వైయస్ బెంబేలెత్తిస్తోంది

 


 చైనాలో పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారిపోయింది... అసలు ప్రజలు ఇంటి గడప నుంచి కాలు కూడా బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం బయటి నుంచి గాలి కూడా లోపలికి రాకుండా కిటికీలు తలుపులు మూసుకుని కేవలం ఇంటికే పరిమితమవుతున్నారు. ఒకవేళ ఏదైనా పని ఉండి బయటికి వచ్చిన వారిని పోలీసులు ట్రీట్ చేస్తున్న విధానం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదులు లాగా... లేదా దొంగలు లాగా... సాధారణ ప్రజలతో వ్యవహరిస్తున్నారు  అక్కడి పోలీసులు అధికారులు. ఇక్కడ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చైనా లో ఎంత దుర్భర పరిస్థితి ఉందో. 

 


 ఈ వీడియోలో కారులో ఓ వ్యక్తి వచ్చాడు... తనకు కరోనా వైరస్ లేదని ఆరోగ్యంగానే ఉన్నాను అంటూ కారు దిగాడు... తన మాస్క్ ను  తీసేసాడు.. ఇంతలో  అక్కడే ఉన్న పోలీస్ అధికారులు ఆ వ్యక్తిని ఒక ఉగ్రవాదిని బంధించి నట్లుగా బంధించారు. ఆంటీబయాటిక్ మాస్కులతో ఉన్న పోలీసులు అందరూ ఒక్కసారిగా ఆ వ్యక్తి మీద పడిపోయి ఉగ్రవాదిని బంధించి నట్లుగా బంధించారు. ఇక ఆ తర్వాత ఆ కార్ చుట్టూ ఆ వ్యక్తిని పట్టుకున్న పోలీసుల చుట్టూ ఆంటీ బయాటిక్ మందులు స్ప్రే  చేసారు. ఈ వీడియో చూస్తుంటే కరోనా  ప్రభావం చైనా దేశంలో ఎంత ఉంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. అయితే దీనికి సంబంధించిన వీడియో కాస్త  సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: