ఈ లోకంలో ఎవరి పని వాళ్లు చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ... వేరొకరి పనిలో వేలు పెట్టి రెచ్చగొడితే అన్ని సమస్యలు వచ్చి పడుతుంటాయి. అయితే ఇలాంటి సామెత ఒకటి ఉంది.. అయితే ఈ సామెత దేనికోసం చెప్పాను అంటే.. పాకిస్తాన్ దిగ్గజ క్రికెట్ ఆటగాడు షాహిద్ అఫ్రిది గురించి. పాకిస్తాన్లో ఎన్నో ఏళ్ల పాటు క్రికెట్ సేవలు అందించి...జట్టును ముందుండి నడిపించాడు షాహిద్ ఆఫ్రిది. అందుకే క్రికెట్ సంబంధించి ఏవైనా ఉంటే తన పని తాను చేసుకుంటే పర్లేదు లేదా తమ దేశ రాజకీయాల్లో రాణించాలని ఉంటే అది తప్పు లేదు కానీ విదేశాల్లో గురించి మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి కదా.. నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడం లాంటిది మరి. 

 

 

 క్రికెటర్ లు అన్నాక  తమ పని తాము చేసుకుంటూ పోవాలి కాని అవసరం లేని వాటిలో కూడా వేలు పెడితే.. అస్సలు బాగోదు.. కానీ ఆఫ్రిది  మాత్రం ప్రస్తుతం అదే చేశాడు.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉండగా భారత దేశం బాగుపడదని..ప్రధాని  ఒక రాక్షసుడు అన్న విధంగా వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా పాకిస్తాన్ తో  ఆడేందుకు భారత్ కి ధైర్యం లేదంటూ పరుషపదజాలం ఉపయోగించాడు. అయితే షాహిద్ అఫ్రిది ఎన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ.. భారత్ నుండి ఒక్కరు కూడా స్పందించలేదు. స్పందించి వృధా అన్న రీతిలో నే సైలెంట్ గా  ఉండి పోయారు. అయితే షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 


 మాజీ క్రికెట్ క్రీడాకారుడు షాహిద్ అఫ్రిదీ తనకున్న సెలబ్రిటీ హోదా కొంచెం కొంచెంగా తగ్గుతుండటంతో పాకిస్థాన్లో భారత్ ని తిడితే మరోసారి హీరో ఇమేజ్ వచ్చి బాగా అందరి చూపు తమపై పడుతుందని భావించిన ఆఫ్రిది  ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెటర్లు ఒక్కసారి కూడా పాకిస్తాన్ ప్రధాని పై కానీ.. ఎవరిపై కానీ విమర్శలు చేయలేదని భారత క్రికెటర్లు అందరికీ స్ఫూర్తిగా ఉంటారని కానీ మీరు మాత్రం కావాలనే భారత ప్రధాని నరేంద్ర మోడీ పై విమర్శలు చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు రాజకీయవిశ్లేషకులు. ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: