సరిగ్గా సంవత్సరం క్రితం పీవోకేలోని బాలాకోట్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సుఖోయ్ యుద్ధవిమానాలు దాడులు మెరుపు వేగంగా దాడులు చేశాయి.  రాత్రి సమయాల్లో దాడులు చేయాలి అంటే చాలా కష్టమైన విషయం.  కానీ, ఇండియాకు చెందిన సుఖోయ్ విమానాలు సమర్ధవంతంగా ఈ దాడులు చేసి తిరిగి వచ్చాయి.  ఫిబ్రవరి 14 వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఇండియన్ ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడులు చేయడంతో 49 మందికి పైగా ఆర్మీ జవానులు మరణించారు.  


దీనికి ప్రతీకారంగా రెండు వారాల్లోనే ఇండియా బాలాకోట్ పై దాడులు చేసి జైషే స్థావరాలపై దాడులు చేసింది.  ఈ దాడుల్లో వందల సంఖ్యలో జైషే ఉగ్రవాదులు మరణించినట్టుగా అప్పట్లో ఇండియా ప్రకటించింది.  కానీ, పాక్ మీడియా మాత్రం దానిని గుర్తించలేదు.  బాలాకోట్ పై ఇండియా చేసిన దాడుల్లో చెట్లకు తప్పించి ఎవరికీ కూడా ఎలాంటి నష్టం జరగలేదని పాక్ వాదిస్తూ వచ్చింది.  ఎఫ్ 16 16 విమానాన్ని ఇండియా కూల్చివేసింది.  


అయినప్పటికీ కూడా పాక్ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు.  ఎఫ్ 16 విమానం కూలిపోయిందన్న విషయాన్ని పక్కన పెట్టి, పాక్ ఎయిర్ ఫోర్స్ దాడుల్లో సుఖోయ్ విమానం కూల్చేశామని, మిగ్ 21 విమానం కూల్చేశామని, అభినందన్ ను పట్టుకున్నామని గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టింది.  అంతేకాదు, ఇండియన్ ఎయిర్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన క్షిపణి శకలాలను ప్రదర్శించింది.  


విషయం ఏమిటంటే పాక్ ప్రదర్శించిన శకలాలలో వార్ హెడ్ లు లేవు.  వార్ హెడ్ ఎప్పుడైనా క్షిపణి మధ్యభాగంలో ఉంటుంది.  అంటే, అది టార్గెట్ ను ఢీకొట్టిన తరువాత దొరికిన శకలం అయ్యి ఉంటుంది.  ప్రపంచంలో కొన్ని దేశాలకు మాత్రమే రాత్రి వేళల్లో దాడిచేయగలిగిన సత్తా టెక్నాలజీ ఉన్నది.  అది ఇండియాకు కూడా ఉన్నది.  కానీ, పాక్ కు ఆ టెక్నాలజీ లేదు.  అందుకే పగలు సమయంలో ఎటాక్ చేయాలని చూసి భంగపడింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: