తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో  రెండు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. 24, 25 తేదీల్లో భారత్లో పర్యటించిన ట్రంప్... పలు ప్రదేశాల ను సందర్శించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవ రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విందుకు  పలువురు కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి మాత్రం ఆహ్వానం అందలేదు ఇక దీని పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది విపక్షాలు కూడా దీని కారణంగా చూపుతూ జగన్ సర్కార్ పై విమర్శలు కూడా చేశారు. 

 

 

 అయితే రాష్ట్రపతి భవన్ లో  అమెరికా అధ్యక్షుడికి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్  కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప, అసోం ముఖ్యమంత్రి సర్బానంద  సోనోవాల్  పాల్గొన్నారు. అయితే జగన్ను ఈ విందుకు ఆహ్వానించక పోవడం పై అటు టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. జగన్ పై ఎన్నో కేసులు ఉన్నాయి కాబట్టి ఆహ్వానం అందలేదు అంటూ సెటైర్లు వేశారు.ఈ  నేపథ్యంలో దీనిపై తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బలమైన నేత అంటూ వ్యాఖ్యానించిన మంత్రి బొత్స... దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయొద్దు అంటూ విమర్శలు గుర్తించారు. 

 

 

 తాజాగా విశాఖ వేదికగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి భవన్ లో  ట్రంప్ తో విందుకు ఏపీ సీఎం జగన్ తో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లకు కూడా ఆహ్వానం అందలేదు అంటూ తెలిపారు. జగన్ మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి  రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు ఆహ్వానం దొరకలేదు అని అనుకుంటే... ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి కూడా ఆహ్వానం దక్కలేదు అంటూ మంత్రి బొత్స తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు ఆహ్వానం అందలేదు అనేదానిపై విపక్ష పార్టీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు బొత్స ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: