ప్రేమ... ఎన్నో మధురానుభూతులను నింపుతుంది... ఎన్నో మరవలేని జ్ఞాపకాలను ఇస్తుంది... ఇది ఒకప్పటి ప్రేమ మాత్రమే నేటి రోజుల్లో ప్రేమ ప్రాణాలను తీస్తుంది. మనుషులను రాక్షసులుగా మారుస్తోంది. ప్రేమ పేరుతో ఈరోజుల్లో హత్యలు ఆత్మహత్యలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో ప్రేమ అంటూ ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఎక్కువై పోతున్నారు. ఇక ప్రేయసి దక్కడం లేదని ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా ఈ రోజుల్లో పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ  దారుణ ఘటన జరిగింది. ఓ నర్సును ప్రేమించినందుకు... యువకుడు సజీవదహనం అయిపోయాడు. ఈ ఘటన ఒక కుటుంబంలో విషాదం నింపడం తో  పాటు స్థానికంగా కలకలం రేపింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... పుదుచ్చేరికి చెందిన రాఘవన్ అనే యువకుడు హైదరాబాదులోని ఓ టైల్స్ కంపెనీ లో పని చేస్తున్నాడు. రాఘవన్ స్థానికంగా ఓ హాస్పిటల్ లో పనిచేసే నర్సును ప్రేమించాడు. ఇద్దరూ కొంత కాలం పాటు ప్రేమలో మునిగితేలారు. ఇక పెళ్లి చేసుకుందామనుకున్న ఈ జంట తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులతో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆ యువతి తల్లిదండ్రులు రాఘవన్ తో పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన యువతి... నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇక ఈ విషయం తెలిసిన రాఘవన్ తన మణికట్టును కోసుకొని ఆత్మహత్య చేసుకోబోయాడు.  ఇక ఇది గమనించిన యజమాని రాఘవన్ కు చికిత్స అందించి పుదుచ్చేరికి పంపించాడు. 

 

 

 ఇక సోమవారం మద్యం తాగిన రాఘవన్ అతని స్నేహితుడు బైక్పై వెళ్తున్న సమయంలో.. మార్గమధ్యంలో ఆరుగురు వ్యక్తులు ఆ బైక్ ని ఆపి రాఘవన్ ను  కిడ్నాప్ చేశారు. ఇక అక్కడినుంచి కొట్టై మెట్టు ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణ రహితంగా కత్తులతో పొడిచారు. అంతేకాకుండా బ్రతికుండగానే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు... రాఘవన్ పై కత్తితో దాడి చేసింది యువతి సోదరుడు ఇతర బంధువులే అని తేలడంతో... వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యాడని ఈ హత్య  వారు అంగీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: