ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల అంశం పట్ల ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మద్దతు తెలపడం జరిగింది. కాగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అమరావతి రాజధాని ప్రాంతం రైతులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అంతేకాకుండా రాజధాని ప్రాంతం అమరావతి లో రైతులు చేస్తున్న దీక్షకు మరియు ఆందోళనలకు గత కొంత కాలం నుండి మద్దతు తెలుపుతూ ఉండటం జరిగింది. అయినా గానీ వైయస్ జగన్ సర్కార్ మాత్రం ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాలని మూడు రాజధానులు తెరపైకి తెచ్చినట్లు క్లారిటీ ఇస్తూ ప్రతిపక్షాల ఆరోపణలను బెదిరింపులను పట్టించుకోకుండా ప్రస్తుతం ముందుకు దూసుకుపోతున్నారు.

 

గతంలో హైదరాబాదులో మొత్తం అభివృద్ధి జరగడం వల్ల విభజన జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థికంగా భయంకరమైన దెబ్బ తగిలిందని అటువంటి దెబ్బ మరొకసారి తగలకూడదు అన్న ఉద్దేశంతో పాటుగా మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముక్కలు అవ్వకూడదని వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నాయకులు తెలపడం జరిగింది. కాగా మూడు రాజధానులలో ఒక రాజధాని విశాఖపట్టణంలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసినదే.

 

ఈ సందర్భంగా వైజాగ్ లో కొత్త సెక్రటేరియట్ భవనాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు. ప్రభుత్వం నుండి అందుతున్న సమాచారం ప్రకారం విశాఖలోని కాపులుప్పాడు దగ్గర ఉన్న కొండ మీద దాదాపు 250 ఎకరాలలో ఏపీ నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మరోపక్క కర్నూల్ లో న్యాయ రాజధాని అదేవిధంగా అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ని ఏర్పాటు చేయటానికి జగన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: