జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ లో పింక్ సినిమా ని సెలెక్ట్ చేసుకోవడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందడం జరిగింది. సినిమాలో కనీసం పాటలు మరి ఫైట్లు కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఇటువంటి సబ్జెక్ట్ పవన్ సెలెక్ట్ చేసుకోవడం పట్ల తీవ్రంగా నిరాశపడ్డారు.

 

ఇటువంటి సమయంలో సినిమా నిర్మాత దిల్ రాజు ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా పూర్తిగా బాలీవుడ్ లో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా అభిమానులకు నచ్చే విధంగా స్టొరీ లో కొన్ని మార్పులు చేసినట్లు తెలపడంతో పాటుగా సినిమాలో మూడు సాంగ్స్, ఫైట్స్ కూడా ఉండబోతున్నాయి క్లారిటీ ఇవ్వడంతో పవన్ అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇక డైరెక్టర్ వేణు శ్రీరామ్ పింక్ సినిమాలోని సోల్ మిస్ కాకుండా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ పై శ్రీరామ్ వేణు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిగా లాయర్ క్యారెక్టర్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఎక్కువ భాగం కోర్టులో ఉంటుంది కాబట్టి పవన్, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో కోర్టులో పవన్ కళ్యాణ్ వేసే డైలాగులు సినిమాకే హైలెట్ కాబోతున్నట్లు ఫిలింనగర్లో టాక్. వచ్చే వేసవిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ వెండితెరపై పవన్ కళ్యాణ్ కనిపిస్తున్న తరుణంలో అభిమానులు ఈ సినిమా కోసం మంచి హడావిడి చేయడానికి రెడీ అవుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: